Skip to content

‘ఇరుముడి’ ఆగస్టు 12న ట్రైలర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ మచ్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌తోనూ ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్’, పాటలతో ఆసక్తిని రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

ఆగస్టు 12న భీమవరంలో జరిగే భారీ కార్యక్రమంలో ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి రవితేజ స్వయంగా హాజరుకానుండటంతో, ఇది సినిమా ప్రచారంలో ఒక కీలక ఘట్టం కానుంది. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు. ఒకవైపు నోటిలో గొడ్డలితో మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, మరోవైపు అయ్యప్ప మాల ధరించిన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపిస్తున్నారు.

ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో సినిమా కథలోని భావోద్వేగ, ఆధ్యాత్మిక అంశాలనే ఎక్కువగా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ ద్వారా రవితేజ పాత్ర ఏమిటి? ఇతర కీలక పాత్రలతో ఆయన సంబంధం ఎలా ఉంటుంది? అసలు కథను నడిపించే పరిస్థితులు ఏమిటి? అనే విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో శివ నిర్వాణ భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలను ఎలా మిళితం చేశారో కూడా ట్రైలర్‌ ప్రజెంట్ చేయనుంది.

‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు చూడని విధంగా మరింత ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా తన కుమార్తెతో ఆయనకు ఉండే అనుబంధం ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆకట్టుకుంది. దీంతో సినిమాలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు కీలక స్థానం ఉండబోతుంది.

ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘ఇరుముడి’కి భీమవరంలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌తో ప్రమోషన్స్ మరింత జోరందుకోనున్నాయి.

నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్
PRO: వంశీ శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.