హీరో - రాకేష్ జాగర్లమూడి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం…
వానర” మూవీ టైటిల్ “వనవీర”గా మార్పు

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా “వనవీర”. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. “వనవీర” చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన “వనవీర” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు హర్ష మాట్లాడుతూ – అందరిలాగే మేమూ మా “వనవీర” మూవీకి చాలా కష్టపడ్డాం. ఈ సినిమా ఎంటో ట్రైలర్ తోనే తెలుస్తోంది. ఒక తండ్రి కోసం కొడుకు పడిన కష్టం ఈ సినిమా అని చెప్పొచ్చు. మా మూవీని జనవరి 1న థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.
నటుడు బాబీ మాట్లాడుతూ – “వనవీర” టైటిల్ చాలా బాగుంది. ఈ సినిమాతో సంక్రాంతి వారం పది రోజుల ముందుగానే మాకు వస్తుందని ఆశిస్తున్నాం. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ఆడియెన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అన్నారు.
డీవోపీ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – రెండేళ్లు కష్టపడి చేసిన చిత్రమిది. ఈ సినిమా టైటిల్ “వానర”ను మీరే ఆడియెన్స్ లోకి తీసుకెళ్లారు. అలాగే “వనవీర”ను కూడా ప్రేక్షకులకు చేర్చాలి. మా హీరో కిరణ్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. జనవరి 1న రిలీజ్ అవుతున్న “వనవీర” మూవీకి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ – “వనవీర” మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ. ఈ సినిమాలో ఫన్, మిస్టరీ, థ్రిల్లింగ్, రొమాన్స్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. వచ్చే ఏడాదిని మేము ఒక బ్యాంగ్ లాంటి మూవీతో స్టార్ట్ చేయబోతున్నాం. తెలుగు ఆడియెన్స్ మంచి చిత్రాలకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. వారి మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. “వనవీర” సినిమాను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
నిర్మాత శంతను పత్తి మాట్లాడుతూ – మా సినిమా టైటిల్ కు సెన్సార్ ఒప్పుకోకపోవడం వల్ల “వనవీర”గా మార్చాం. అన్ని పర్మిషన్స్ తోనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అదే టైటిల్ తో బాగా ఖర్చు పెట్టి ప్రచారం చేశాం. “వనవీర” టైటిల్ ను కూడా మీడియా మిత్రులు ఆడియెన్స్ దగ్గరకు తీసుకెళ్లాలి. మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. స్క్రీన్ మీద మా మూవీ చూస్తే ఒక పెద్ద సినిమాలా అనిపిస్తుంది. చిన్న సినిమా అనే ఫీల్ రాదు. మా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం గారికి, ఈ రోజు మా ఈవెంట్ కు వచ్చిన ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారికి థ్యాంక్స్. హీరోయిన్ సిమ్రాన్ మా మూవీకి చాలా సపోర్ట్ చేసింది. మూవీ రిలీజ్ అయ్యాక సక్సెస్ టూర్ కు కూడా వస్తానని చెప్పింది. అన్నారు. జనవరి 1న న్యూ ఇయర్ ను మా సినిమాతో సెలబ్రేట్ చేసుకునేలా మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాం. అన్నారు.
అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ – “వనవీర” సినిమా ట్రైలర్ చాలా బాగుంది. సీజీ వర్క్ చాలా క్వాలిటీగా చేశారు. ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఇలాంటి క్వాలిటీ సీజీ చేయలేకపోతున్నారు. అవినాష్ వాళ్ల ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన హీరో కావాలనుకున్నారు. కానీ కాలేకపోయారు. తండ్రి కలను నిజం చేస్తూ అవినాష్ హీరోగా మారారు. హీరోగానే కాదు దర్శకుడిగానూ మారి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ శంతను ఖర్చుకు వెనకాడకుండా ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. వానర సినిమా టైటిల్ కు సెన్సార్ నుంచి అభ్యంతరం వ్యక్తమయితే “వనవీర”గా మార్చారు. ఈ టైటిల్ ను మీడియా మిత్రులు ప్రేక్షకులకు రీచ్ చేయాలి. ఈ సినిమా గురించి మా ఛోటా కె ప్రసాద్ ఎప్పుడు చెబుతుంటారు. డిసెంబర్ 25నే “వనవీర” సినిమా రిలీజ్ కావాలి. అప్పుడు వచ్చే పది సినిమాల్లో ఇదొకటి అయ్యేది. అందుకే జనవరి 1న రిలీజ్ చేస్తున్నారు. గత వారం రిలీజైన మూవీస్ అన్నీ బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
హీరో, డైరెక్టర్ అవినాష్ తిరువీధుల మాట్లాడుతూ – అన్ని నిబంధన ప్రకారమే మా మూవీ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాం. గతేడాది అనౌన్స్ చేశాం. ఇప్పుడు కొద్ది రోజుల్లో రిలీజ్ ఉంది అనగా టైటిల్ మార్చమని చెబితే మాలాంటి చిన్న మూవీస్ ప్రొడ్యూసర్స్ ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి.గతంలో వాల్మీకి సినిమాను గద్దలకొండ గణేష్ గా మార్చారు. పెద్ద హీరో, డైరెక్టర్, ప్రొడక్షన్ వల్ల ఆడియెన్స్ లోకి త్వరగా రీచ్ అయ్యింది. ఇప్పుడు ఐదు రోజుల్లో మా సినిమా రిలీజ్ కు ఉంది. పబ్లిసిటీ మీద ఖర్చు చేశాం. హైదరాబాద్ తో పాటు ఏపీలో ప్రమోషనల్ టూర్స్ చేశాం. ఇప్పుడు మీడియా మిత్రుల మీదే మా నమ్మకం పెట్టుకున్నాం. మీరే మా టైటిల్ ను అందరికీ తెలిసేలా చేయాలి. కిరణ్ అబ్బవరం అన్నకు టైటిల్ వనవీర అని మార్చాం, ట్రైలర్ రిలీజ్ చేయాలని చెప్పగానే వెంటనే పంపించు చేస్తానని అన్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమాలో కీ రోల్స్ చేసిన ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు కూడా కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా సపోర్ట్ చేయడం లేదు. నటించిన సినిమాకు కనీసం పబ్లిసిటీ చేయాలనేది వారి బాధ్యతగా భావించడం లేదు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. మైథాలజీ టచ్ ఉంటుంది. వానర అంటే హనుమంతుడే గుర్తుకు వస్తాడు, కులం, రాజకీయాలు వంటి సున్నిత అంశాలున్న ఈ చిత్రానికి ఆ టైటిల్ సరికాదు అనేది సెన్సార్ వారు చెబుతున్నారు. మేము అంగీకరిస్తాం కానీ ముందే మాకు ఇలాంటి విషయాల గురించి అబ్జెక్షన్ చెప్పాల్సింది. మా సినిమా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఒక హిట్ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. మా సినిమా నిరాశపర్చదు అనే కాన్పిడెంట్ తో ఉన్నాం. అన్నారు.
నటీనటులు – అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు
టెక్నికల్ టీమ్
——————————-
ప్రొడక్షన్ డిజైనర్ – నార్ని శ్రీనివాస్
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సుజాత సిద్ధార్థ్
మ్యూజిక్ – వివేక్ సాగర్
డైలాగ్స్ – సాయిమాధవ్ బుర్రా
స్టోరీ, స్క్రీన్ ప్లే – విశ్వజిత్
సమర్పణ – శంతను పత్తి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్
నిర్మాతలు – అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి
డైరెక్షన్ – అవినాష్ తిరువీధుల
