- ఆగస్ట్ 8న తమిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద…
వీ వుమెన్ వాంట్ కాన్ క్లేవ్ లో శక్తి అవార్డ్ సొంతం చేసుకున్న హీరోయిన్ మాళవిక మోహనన్


బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ మరో ఘనత దక్కించుకుంది. ఆమె ఢిల్లీలో జరిగిన వీ వుమెన్ వాంట్ కాన్ క్లేక్ (We Women Want Conclave 2025)లో శక్తి అవార్డ్ సొంతం చేసుకుంది. ఎక్సలెన్స్ ఇన్ స్టైల్ విభాగంలో మాళివక మోహనన్ శక్తి అవార్డ్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ చేతుల మీదుగా ఆమె శక్తి అవార్డ్ స్వీకరించారు. ఈ సందర్భంగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. శక్తి అవార్డ్ తీసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన రాజా సాబ్ టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గర కానుంది మాళవిక.