‘సర్దార్ 2’ నుంచి ఎస్.జే. సూర్య స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నీలం రంగు సూట్‌లో స్టైలిష్ లుక్‌తో మెట్లపై నిలబడి కనిపించిన ఎస్.జే. సూర్య పోస్టర్‌లో ఎంతో క్లాసీగా, మిస్టీరియస్‌గా కనిపిస్తున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న భారీ డ్రాగన్ ఆర్ట్‌వర్క్, డార్క్ టోన్, షేడ్స్‌తో కూడిన ఆయన లుక్ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది…
