హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్టర్1-ఉధిరం’. ఇప్పటి వరకు విడుదలైన టైటిల్ ఫస్ట్…
‘సర్దార్ 2’ నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ : హీరో కార్తీ

‘సర్దార్’ ప్రేక్షకులందరికీ నచ్చిన సినిమా. ‘సర్దార్ 2’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: డైరెక్టర్ బోయపాటి శ్రీను
‘సర్దార్’ నా ఫేవరెట్ ఫిల్మ్. ‘సర్దార్ 2’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను: హీరో అడివి శేష్
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హాజరయ్యారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకలో మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన రవి గారికి, బోయపాటి గారికి, కళ్యాణ్ గారికి, అనిల్ గారికి, ప్రసాద్ గారికి, శేష్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘సర్దార్’ సినిమాకు ఇక్కడ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ‘సర్దార్ 2’ నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇలాంటి స్పై క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం. నిజానికి గూఢచారులకు ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ వాళ్ల పని వాళ్లు చాలా నిజాయితీతో, ఏదీ ఆశించకుండా చేస్తారు. ‘సర్దార్ 2’ చూసే ముందు ‘సర్దార్’ సినిమా మరొకసారి చూడమని కోరుతున్నాను. అది యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. అలా ఆ సినిమా చూస్తే మీరు ‘సర్దార్ 2’కి ఇంకా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇంత స్టైలిష్‌గా యాక్షన్ సినిమాలు చేయడం మనకు కుదరదా అని అనిపించేది. అది ఈ సినిమాతో తీరింది. మిత్రన్ గారు అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. మ్యూజిక్, యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇలాంటి పెద్ద సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. మా నిర్మాతలకు థాంక్యూ. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగార్జున గారికి, సుప్రియ గారికి, అన్నపూర్ణ స్టూడియోస్‌కి ధన్యవాదాలు. ఇలాంటి పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ ఆర్టిస్టులు కావాలి. ఆశికా మాళవిక సినిమాలో మంచి పాత్రలు చేశారు. ఈ సినిమాలో డాన్స్ లేదు.. యాక్షన్ ఉంటుంది. గర్ల్ పవర్ చూడబోతున్నారు, సినిమాని పెద్దగా చేయాలంటే స్ట్రాంగ్ విలన్ కావాలి. సూర్య గారిని మీరు వేరే రకంగా ఇందులో చూస్తారు. అందరూ ఎంజాయ్ చేసే విలన్‌గా చేశారు. అదరగొట్టారు. ఇందులో థియేటర్‌లో మీ రియాక్షన్ చూడడానికి ఎదురుచూస్తున్నాను. షామ్ సీఎస్‌కి ఇది వందో సినిమా. ‘ఖైదీ’ తర్వాత తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఎప్పుడూ కూడా మీరు తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటారు. ‘హిట్ 4’ సినిమా వస్తుంది. అంతకుముందు కళ్యాణ్ శంకర్‌తో సినిమా కూడా వస్తుంది. ఆ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను. ‘సర్దార్ 2’ మాకు చాలా స్పెషల్ సినిమా. అన్నపూర్ణ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్నపూర్ణ ఉంటే అన్నీ ఉన్నట్టే. సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ థాంక్యూ. బోయపాటి గారి ‘భద్ర’ సినిమాకి నేను పిచ్చిపిచ్చి ఫ్యాన్‌ని. అయినా తర్వాత మేము సినిమా చేయడానికి కలిశాము. కాకపోతే కుదరలేదు. కానీ ఆయన చాలా క్రమశిక్షణతో ఉండే దర్శకుడు. శేష్ ఫిలిం లవర్. మేమిద్దరం ఎప్పుడు కూర్చున్నా సినిమా గురించే మాట్లాడుతాం. ఆయన ‘హిట్’ యూనివర్స్‌లో నేను జాయిన్ కావడం హ్యాపీగా ఉంది. మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను. త్వరలో చాలా తెలుగు సినిమాలు చేస్తాను. మనం మళ్లీ మళ్లీ కలుద్దాం. అందరికీ థాంక్యూ సో మచ్.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. నా ఫేవరెట్ సినిమాల్లో కార్తీ గారివే ఎక్కువ. ఆవారా, ఖైదీ, ‘సత్యం సుందరం’ ఈ సినిమాలన్నీ ఇష్టం. అలాగే నాకు ‘సర్దార్’ సినిమా కూడా చాలా ఇష్టం. స్పై సినిమాల్లో మాస్ మసాలా ఫిలిం ‘సర్దార్’. ఈ సినిమాని నేను థియేటర్‌లో చాలా ఎంజాయ్ చేశాను. సర్దార్ 2 ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. మాళవిక, ఆశికా రంగనాథన్, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో కలుద్దాం.
ఎస్.జె. సూర్య మాట్లాడుతూ.. సర్దార్ ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఆ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ‘సర్దార్ 2’ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కంటెంట్, యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ మిత్రన్ గారు అద్భుతమైన కథతో సినిమాని ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. డైరెక్టర్ గారు ఫ్యూచర్‌కి ఏం కావాలో అనే ఒక విషయాన్ని చెప్తున్నారు. ఈ సినిమాని మీరు గుండెల్లో పెట్టుకోవాలి. ఆలోచించాలి. కార్తీ గారు మంచి కథలకు ఎప్పుడూ ఆమోదం తెలుపుతారు. ఆయన సినిమాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా, డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన ఎప్పుడూ సినిమా గురించి ఆలోచిస్తుంటారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్తీ గారికి, నాగార్జున గారికి చాలా మంచి స్నేహం ఉంది. ఆశికా రంగనాథ్, మాళవిక మోహనన్ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. కార్తీ గారు ఒక ఏజెంట్‌గా ఫెంటాస్టిక్‌గా పెర్ఫామ్ చేశారు. ఇందులో రెండు గెటప్స్ ఉన్నాయి. చాలా సిన్సియర్‌గా చేశారు. ఆయన ఈ సినిమా మీద పెట్టిన ప్రేమ కోసం మీరందరూ సెప్టెంబర్ 10న సినిమా చూసి చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా టీమ్ అందరికీ అభినందనలు. ప్రేక్షకులు సినిమా ఎంజాయ్ చేయండి. మంచి సక్సెస్ ఇవ్వండి.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. తెలుగు సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తోంది. పరిశ్రమ కళకళలాడుతోంది. ఇలాంటి సమయంలో ‘సర్దార్ 2’ సినిమా వస్తోంది. మా సినిమా కూడా ఇదే దోవలో అద్భుతమైన సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘సర్దార్’ ప్రేక్షకులందరికీ నచ్చిన సినిమా. కార్తీ గారు, సూర్య గారు డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే వాళ్లిద్దరూ చాలా మంచి మనసున్న మనుషులు. వాళ్లిద్దరూ చాలా పాజిటివ్‌గా ఉంటారు. అందుకే ప్రేక్షకులు కూడా ఇంత పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మిగతా సినిమాలన్నీ కూడా మంచి సినిమాలు అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు పరిశ్రమ సక్సెస్ రేట్ ఇలాగే ముందుకు వెళ్లాలి. కార్తీ గారితో ప్రత్యేకమైన పరిచయం ఉంది. ఆయన ఎలాంటి మనిషో నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా మొదటి రోజు చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం.
హీరోయిన్ మాళవిక మోహన్ మాట్లాడుతూ: సర్దార్ చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశారు. . కార్తీక్ గారు ఇన్‌స్పైరింగ్ కోస్టార్. చాలా జెంటిల్‌మ్యాన్. సూర్య గారు కూల్ విలన్. చాలా మంచి యాక్షన్, యాక్షన్ డ్రామా ఉన్న సినిమా ఇది. అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఆశిక రంగనాథ్ మాట్లాడుతూ: సర్దార్ 2 నాకు చాలా స్పెషల్ సినిమా. నేను చేస్తున్న ఫస్ట్ యాక్షన్ జానర్. అలాగే కార్తీక్ గారితో చేస్తున్న తొలి సినిమా. సర్దార్ చాలా ఇంపాక్ట్ చేసింది. దానికంటే ఈ సినిమా డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్ గారితో నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది.”
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ: సర్దార్ పెద్ద హిట్. సర్దార్ 2 కూడా సినిమా స్థాయికి తగ్గకుండా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. కార్తీక్ గారు పాన్ సౌత్ స్టార్. ఆయన సినిమాలు అందరికీ ఇష్టం. సర్దార్ 2 కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఆ సినిమాతో పాటు వచ్చిన మిగతా సినిమాలన్నీ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ: సర్దార్ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్. ఆ సినిమాకి మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్. ఈ సినిమా తెలుగు వెర్షన్ చూశాను. సర్దార్ ఎంట్రీ అదిరిపోతుంది. ఎస్జే సూర్య గారి హ్యాండ్ చాలా మంచిది. ఒకరిని సీఎం చేశారు, మరొకరిని డిప్యూటీ సీఎం చేశారు. ఈ సినిమా అదిరిపోవాలి.”
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ: ‘ఆవారా’లో కార్తీక్ గారిని ఎలా చూశారో, మా సినిమాతో కళ్యాణ్ అలా సినిమా చూపించబోతున్నాడు. సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. సర్దార్ తెలుగులో చాలా పెద్ద హిట్. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ: తెలుగు పరిశ్రమలో కార్తి అంటే అందరికీ ఇష్టం. సర్దార్ పెద్ద హిట్. సర్దార్ 2పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచాయి. ఈ సినిమా కార్తి గారి రికార్డులన్నీ రీ-క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకు సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

