‘సర్దార్ 2’ స్పై మిస్టరీ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. సర్దార్ తో ఏర్పడిన స్పై యూనివర్స్‌ను మరింత పెద్ద కాన్వాస్‌పైకి తీసుకెళ్లిన ఈ సీక్వెల్‌లో డేంజర్, కాన్ఫ్లిక్ట్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గతంలో జరిగిన సంఘటనలను, ప్రస్తుతం ఎదురవుతున్న ప్రమాదాన్ని కలిపి కథను ప్రజెంట్ చేయడం అద్భుతంగా ఉంది. మురుగన్ స్వామికి పరమ భక్తుడైన సర్దార్‌ను జపాన్‌లో…
