Y N R Sports Academy,church GaGiLLAPUR. Dr. Laaksha Naidu has received "AN…
సుందరకాండ’ని ఎంజాయ్ చేస్తారు: నారా రోహిత్

హీరో నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటించారు. ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం. ‘సుందరకాండ’ కి వచ్చిన అద్భుతమైన రివ్యూలు చాలా ఆనందాన్నిచ్చాయి. థియేటర్స్ వచ్చి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్. సినిమాకి చాలా అద్భుతమైన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడండి. టికెట్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్ లో ఉంచాము. ఫ్యామిలీతో ఈ వీకెండ్ వెళ్లి హ్యాపీగా చూడండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మంచి చిత్రం ఇది. మా టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్యూ. వారి సపోర్టు చాలా ఇంపార్టెంట్. మా నిర్మాతలు చాలా అద్భుతమైన సహకారాన్ని అందించారు. సత్యకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. తన క్యారెక్టర్ కి చాలా మంచి పేరు వచ్చింది. సత్య వల్ల థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. వెంకీ రాసిన డైలాగ్ గురించి చాలామంది ప్రత్యేకంగా చెప్పారు. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా చూడని వాళ్ళు కూడా ఈ వీకెండ్ చూసి మీ ఫీడ్ బ్యాక్ మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. థాంక్యూ సో మచ్.
డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సక్సెస్ లో భాగమైన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ కి థాంక్యూ. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసి అందరూ నవ్వుకుంటున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. నవ్వించడం అంత ఈజీ కాదు. నా రైటింగ్ కి మంచి అప్రిసియేషన్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది. హీరో రోహిత్ అన్న, నిర్మాత సంతోష్ అన్న.. వాళ్ళిద్దరూ బిలీవ్ చేయకపోతే ఈ సినిమా మీ ముందు ఉండేది కాదు. ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇండస్ట్రీలో ప్రతి విషయం రోహిత్ గారి దగ్గర నేర్చుకున్నాను. సినిమా విషయంలో ఎంత నిజాయితీగా ఉండాలో నేర్పించారు. ఈరోజు నాకు వస్తున్న అభినందనలకు కారణం రోహిత్ అన్న గైడెన్స్. సత్య ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు. ఆయన గురించి పాజిటివ్గా రాస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను.
హీరోయిన్ విర్తి వాఘాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. సినిమాకి చాలా అద్భుతమైన రివ్యూస్ వస్తున్నాయి. ఐరా పాత్ర గురించి చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు. వారి ప్రోత్సాహం నాకు ఎంతగానో ఉత్సాహాన్ని ఇస్తుంది. రోహిత్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి మరోసారి కృతజ్ఞతలు.
నిర్మాత సంతోష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. సినిమాకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. రెస్పాన్స్ రోజు రోజుకి పెరుగుతుంది. యూఎస్ లో డే వన్ కంటే డే టు ఎక్కువ ఉంది. అది మాకు గొప్ప ఎనర్జీని ఇస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా గురించి అద్భుతంగా చెబుతున్నారు. దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి వచ్చినట్టు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశారని చెబుతుంటే గొప్ప ఆనందం కలిగింది. ఇదంతా టీం వర్క్ తోనే సాధ్యపడింది. ఈ సినిమాకి రోహిత్ అన్న బ్యాక్ బోన్ లా నిలబడ్డారు. ఈ సినిమాని అందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపుగా అన్ని థియేటర్స్ లో మన సినిమా ఉంది. టికెట్ ధరలు కూడా రీజనబుల్ గా ఉన్నాయి. తప్పకుండా అందరూ దియేటర్స్ లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను.
నిర్మాత రాకేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. వెంకీ ఈ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు చాలా సెన్సిటివ్ పాయింట్ అనిపించింది. మేమేదైతే ఎక్సైట్ అయ్యామో ఆడియన్స్ కూడా సినిమా చూసి అంతే ఎక్సైట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. రివ్యూస్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
వాసుకీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఈ సినిమా కథ విన్నప్పుడే ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుసు. మంచి కంటెంట్ అద్భుతమైన కథ ఉన్న సినిమా ఇది. ఇలాంటి కంటెంట్ రావడం చాలా యూనిక్. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ లో మూవీ టీం అందరూ పాల్గొన్నారు