Skip to content

‘వార్ 2’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. హృతిక్ రోషన్, కియారా అద్వానీ పై చిత్రీకరించిన ‘ఆవన్ జావన్’

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద అయాన్ ముఖర్జీ భారీ ఎత్తున తెరకెక్కించిన చిత్రం ‘వార్ 2’. ఐకానిక్ స్టార్‌లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్‌ను అయాన్ ముఖర్జీ ఇచ్చారు.

‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈరోజు (జూలై 29) తన సోషల్ మీడియాలో ‘వార్ 2’ లోని మొదటి పాట ‘ఆవన్ జావన్’ గురించి పోస్ట్ వేశారు. సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, కియారా అద్వానీ నటించిన ఈ రొమాంటిక్ సాంగ్ గురించి చిత్రయూనిట్ అప్డేట్ ఇచ్చింది. బ్రహ్మాస్త్రలోని తన బ్లాక్ బస్టర్ పాట కేసరియా ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ ‘ఆవన్ జావన్’ పాట కోసం ప్రీతమ్, అమితాబ్ భట్టాచార్య, అరిజిత్ సింగ్ అందరూ కలిసి ఈ ప్రత్యేకమైన పాట కోసం పని చేశారు. హృతిక్, కియారా కెమిస్ట్రీ ఈ పాటకు మరింత ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ వారమే ఈ పాట అందరి ముందుకు రానుంది. ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదలకానుంది.