Skip to content

ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి క్రేజీ కాంబో.. ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కళ్యాణ్ రామ్ భారీ మూవీ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి మ‌నం చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌వ‌ర‌సాల్లో ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే ఈ స్టార్ హీరో.. ఇప్పుడు కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా పేరున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ ప‌వ‌ర్ ప్యాక్‌డ్ మూవీ చేయ‌టానికి రెడీ అయ్యారు. ఈ ప్రెస్టీజియ‌స్‌ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, అనిల్ రావిపూడి వారి అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అవి పూర్తి కాగానే ఈ సినిమాను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌, అనిల్ రావిపూడి క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ కాంబో మూవీకి సంబంధించిన‌…

Read more

ఎన్టీఆర్ లాంచ్ చేసిన ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. “ ఒక్క మాట కూడా మాట్లాడకుండా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్ కి నిదర్శనం. నీ…

Read more

ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ, మానవీయ విలువల్లో మనం పూర్తిగా దిగజారిపోతున్నామంటూ పోస్ట్

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో మహిళల్ని కించపరిచేలా రూపొందించిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై హీరో ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ఆగ్రహాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఎన్టీఆర్ కు మద్ధతుగా నిలబడేందుకు ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. మానవీయ విలువల్లో మనం పూర్తిగా దిగజారిపోయామంటూ ఆయన ట్వీట్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ - విలువల పరంగా మనం నీచమైన స్థాయికి దిగజారిపోతున్నాం. ఈ ఘటనకు బాధ్యుతలైన వారిని వదిలిపెట్టకూడదు. చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించాలి. మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా గుణపాఠం నేర్పాలి. పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మనం…

Read more

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ఎన్టీఆర్‌

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన‌ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు.ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో.. హీరో ఫాహద్ ఫాజిల్ మాట్లాడుతూ ‘‘ఇంత అభిమానం ఎప్పుడూ చూడలేదు. ఈ…

Read more

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఈ సంస్థకి , ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదు. – ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన!

ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు. శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా…

Read more

‘లెనిన్’ చిత్రానికి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ఇక ట్రైలర్‌కి నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా చిత్రయూనిట్ మరో సర్ ప్రైజ్‌తో అభిమానుల్లో అంచనాల్ని మరింతగా పె ంచింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘లెనిన్’ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా కథను, నేపథ్యాన్ని, శ్రీరామపురం గురించి ఎన్టీఆర్ తన గంభీరమైన…

Read more

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లోకి యువత ను, బడుగులను ప్రోత్సహించి రాజకీయాలను మలుపు తిప్పిన మహనీయుడని, అటువంటి వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డును నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు టిడి జనార్దన్ కు అందించడం సముచితమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు హైదరాబాదులోని త్యాగరాజ గాన సభలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ…

Read more

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో మరో భారీ చిత్రం.. దైవిక నేపథ్యంతో అద్భుత దృశ్య కావ్యం!

విజయాలు సాధించే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి. కానీ, చరిత్ర సృష్టించి, చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అద్భుతానికి శ్రీకారం చుట్టారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నటుడు-దర్శకుడు ద్వయం, భారతీయ చలనచిత్ర రంగంలో…

Read more
విరాళాలపై అప్రమత్తంగా ఉండాలి Telugu News

విరాళాలపై అప్రమత్తంగా ఉండాలి

‘‘కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్‌ పేరుతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఎన్టీఆర్‌ కు సంబంధం లేదు. వీటిని ఆయన ఏ విధంగానూ ఆమోదించడం లేదని అధికారికంగా స్పష్టం చేస్తున్నాం. ఎన్టీఆర్‌, ఆయన ఆఫీస్‌తో సంబంధం ఉన్నట్లుగా చెబుతూ కొనసాగిస్తున్న కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, శ్రేయోభిలాషులను, అభిమానులను కోరుతున్నాం. ఎలాంటి ప్రకటనలైనా, సామాజిక కార్యక్రమాలైనా.. వాటి వివరాలు నేరుగా ఎన్టీఆర్‌ నుంచే వెల్లడి అవుతాయి. మీ సహకారానికి, నిరంతర అభిమానానికి ధన్యవాదాలు ’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Read more
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల Telugu News

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల

ది కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ‘మృత్యుంజయ్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రాన్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ సినిమాతో మరోసారి ఆడియెన్స్‌ని పలకరించనున్నారు. ‘మృత్యుంజయ్’ టీజర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటకి కూడా యూట్యూబ్‌లో ఆదరణ దక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ఎన్టీఆర్…

Read more