Skip to content

ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ, మానవీయ విలువల్లో మనం పూర్తిగా దిగజారిపోతున్నామంటూ పోస్ట్

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో మహిళల్ని కించపరిచేలా రూపొందించిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై హీరో ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ఆగ్రహాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఎన్టీఆర్ కు మద్ధతుగా నిలబడేందుకు ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. మానవీయ విలువల్లో మనం పూర్తిగా దిగజారిపోయామంటూ ఆయన ట్వీట్ చేశారు.

హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ – విలువల పరంగా మనం నీచమైన స్థాయికి దిగజారిపోతున్నాం. ఈ ఘటనకు బాధ్యుతలైన వారిని వదిలిపెట్టకూడదు. చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించాలి. మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా గుణపాఠం నేర్పాలి. పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామనే సందేహాన్ని ఈ ఉదంతం రేకెత్తిస్తోంది. మరొకరిని బాధపెట్టడంలో సంతోషాన్ని వెతుక్కునేలా మారిపోవడం బాధాకరం. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని ప్రపంచమంతా భయపడుతుంటే మరోవైపు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు ఇలాంటి తప్పుడు పనులకు ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ వేదికలపై జరిగినా దీన్ని లైంగిక దాడితో సమానంగా పరిగణించాలి. చట్టప్రకారం తీవ్రంగా శిక్షించాలి. ఈ ఘటనను వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరికీ నా పూర్తి మద్దతు ఉంటుంది. అన్నారు.

https://x.com/TheDeverakonda/status/2106367084032860288

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.