మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
హైటెక్ సిటీలో ‘‘కమల్ లైఫ్ స్టైల్ హౌస్’’ ప్రారంభం..

– ప్రారంభించిన అందాల బాలీవుడ్ స్టార్ మౌని రాయ్..
– కమల్ వాచ్ కో ఆధ్వర్యంలో నూతనంగా లైఫ్ స్టైల్ హౌస్..
హైదరాబాద్, అక్టోబర్ 2, 2025:: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వేదికగా కమల్ వాచ్ కో ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కమల్ లైఫ్ స్టైల్ హౌస్’ను బాలీవుడ్ స్టార్ మౌని రాయ్ ప్రారంభించారు. బాలీవుడ్ సినీతార మౌని రాయ్ తళుక్కున మెరిసిన ఈ కార్యక్రమం రిబ్బన్ కట్ వేడుకతో పాటు సాంప్రదాయంగా దీపం వెలిగించి నిర్వహించిన ప్రారంభోత్సవం లగ్జరీ రిటైల్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికింది.
దాదాపు 60 సంవత్సరాల క్రితం చైర్మన్ శ్రీ చంద్‌మల్ తోట్ల స్థాపించిన కమల్ వాచ్ కో.., ఈ 60 ఏళ్ల కాలంలో విశ్వసనీయమైన సంస్థగా పేరుగాంచింది. కమల్ లైఫ్ స్టైల్ హౌస్ ప్రారంభంతో ఈ వేదిక నగరానికి లగ్జరీ, స్టైల్ బ్రాండ్స్‌కు ప్రముఖ గమ్యస్థానంగా నిలుస్తోంది. ఈ స్టోర్ 50కి పైగా ప్రీమియం, ఫ్యాషన్ వాచ్ బ్రాండ్‌ల విభిన్నమైన సేకరణతో తన ప్రశస్తిని విస్తరిస్తుంది. అంతేకాకుండా క్యారట్‌లేన్ ద్వారా బంగారం, వెండి ఆభరణాలు, స్వరోవ్స్కీ ద్వారా ఆభరణాలు, డెకరేటీవ్ క్రిస్టల్స్, అంతర్జాతీయ హై-ఎండ్ పెర్ఫ్యూమ్‌ల క్యూరేటెడ్ సెలక్షన్‌ను ప్రదర్శిస్తుంది.
ఈ నూతన కమల్ లైఫ్ స్టైల్ హౌస్ కస్టమర్‌లకు షాపింగ్‌ను మాత్రమే కాకుండా అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్, అందమైన ఇన్ హౌస్, విశాలమైన పార్కింగ్.. అన్నింటికీ మించి ఆత్మీయమైన ఆతిథ్యంతో మైమరపించే విలాసమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. వారసత్వ వైభవంతో పాటు అధునాతనత, ఆధునిక వైవిధ్యాన్ని ఒకే పైకప్పు క్రింద సమ్మిళితం చేస్తూ., కమల్ లైఫ్ స్టైల్ హౌస్ హైదరాబాద్‌లోని లైఫ్ స్టైల్ రిటైల్‌ను పునర్నిర్వచించటానికి సంసిద్ధంగా ఉంది.


