‘చాంపియన్’ బ్లాక్బస్టర్ విజయంతో యంగ్ హీరో రోషన్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. స్వప్న సినిమాస్…
“వృషభ” ప్రీ రిలీజ్ ఈవెంట్ – ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీవాస్

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ “వృషభ”. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తోంది. “వృషభ” చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమల్ లహోటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న “వృషభ” సినిమాను దర్శకుడు నందకిషోర్ మలయాళం, తెలుగులో రూపొందించారు. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు బలగం సంజయ్ మాట్లాడుతూ – ఏడాది కిందట “వృషభ” సినిమా షూటింగ్ చేశాం. షూటింగ్ మొత్తం ముంబైలో జరిగింది. మోహన్ లాల్ గారితో కలిసి నటించడం మర్చిపోలేను. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ మూవీ. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. సమర్జిత్ తో నా ఫైట్స్ కు మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమా గ్రాండియర్, సీజీ వర్క్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అన్నారు.
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – “వృషభ” ఒక పవర్ ఫుల్ సినిమా. ఈ సినిమాలో నెక్ట్స్ ఏం జరుగుతుంది అనేది ఊహించలేరు. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఆసక్తిగా చూసేలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మోహన్ లాల్ గారి లాంటి లెజెండరీ యాక్టర్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నేను మలయాళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాను. ఇంత భారీ చిత్రంతో నేను మలయాళంలో అడుగుపెడతానని అనుకోలేదు. ఈ సినిమాలో పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. నా క్యారెక్టరే కాదు కథలోని ప్రతి పాత్ర కీలకంగా ఉంటుంది. నందకిషోర్ గారు కథను అలా రాసుకున్నారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, ఎస్ వీ స్టూడియోస్ వంటి బ్యానర్స్ లో నటించడం గర్వంగా ఉంది. గీతా ఆర్ట్స్ నా హోమ్ బ్యానర్. ఆయ్ సినిమాతో నాకు ఫస్ట్ హిట్ ఇచ్చింది ఈ సంస్థ. ఈ సంస్థ ద్వారా మా “వృషభ” సినిమా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం నా కెరీర్ కు మరో విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను. ఈ నెల 25న మా “వృషభ” సినిమాను థియేటర్స్ లో చూడండి. అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ – ఈ చిత్ర దర్శకుడు నందకిషోర్ కన్నడలో చేసిన ప్రతి సినిమా హిట్టే. పొగరు, కరెంట్ తీగ వంటి చిత్రాలు ఆయనవే. ఈ సినిమాను ఎంతో కష్టపడి నందకిషోర్ రూపొందించారు. ఎలాంటి గర్వం లేని దర్శకుడు నందకిషోర్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఈ సినిమాలో నటిస్తే, తెలుగు ప్రొడ్యూసర్స్ లో సూపర్ స్టార్ అయిన అల్లు అరవింద్ గారు “వృషభ” సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అలాగే బన్నీ వాస్ గారిది లక్కీ హ్యాండ్. హీరో సమర్జిత్ టాలెంటెడ్ యాక్టర్. బాలాజీ టెలిఫిలింస్ జితేందర్ గారితో నేను తోఫా అనే మూవీతో పాటు మొత్తం 3 చిత్రాలు చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో నటించాను. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న “వృషభ” సినిమా మంచి వి జయం సాధించాలని, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
హీరో సమర్జీత్ లంకేష్ మాట్లాడుతూ – “వృషభ” బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం. అలాగే లవ్, ఫాదర్ సన్ మధ్య ఎమోషన్ కూడా చాలా ఉంటుంది. మోహన్ లాల్ గారితో నటించేప్పుడు మొదట భయం వేసింది. ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి నటించేలా చేశారు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. అలీ గారితో సెట్ లో ఫన్ గా ఉండేది. ఆయన మంచి బిర్యానీ తీసుకొచ్చేవారు. గీతా ఆర్ట్స్ తో మా “వృషభ” సినిమా రిలీజ్ అవుతోంది. అరవింద్ గారికి, బన్నీ వాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 25న మా చిత్రాన్ని చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి “వృషభ” సినిమాను నిర్మించారు. ఈ సినిమా విజువల్స్ గ్రాండ్ గా ఉంటాయి. కింగ్ ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి సినిమా మరో స్థాయికి వెళ్తుంది. ఫైట్స్, ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంటుంది. సామ్ సీఎస్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను దాదాపు 45 నిమిషాల పుటేజ్ చూశాను. సమర్జిత్ లో ఈజ్ ఉంది. అతను కన్నడలో పెద్ద స్టార్ అవుతాడు. నయన్ ఆయ్, క సినిమాల తర్వాత వృషభతో హ్యాట్రిక్ అందుకోవాలి. మోహన్ లాల్ గారు అంటే మనందరికీ గౌరవం. ఆయన ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అన్ని భాషల నటీనటులు ఉన్నారు. డైరెక్టర్ నందకిషోర్ గారు టాలెంటెడ్ టెక్నీషియన్. ఆయన మేకింగ్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. ఈ 25న ఏడు సినిమాలు రిలీజ్ కు వస్తున్నాయి. అన్ని మూవీస్ కు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. 25 నుంచి మళ్లీ సంక్రాంతి హాలీడేస్ వరకు సినిమా ఇండస్ట్రీకి మంచి సీజన్ అని చెప్పొచ్చు. హాలీడేస్ ఉన్నాయి. అన్ని సినిమాలు ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. “వృషభ” సినిమాను రెండు నెలల క్రితమే రిలీజ్ చేయాలి. అనివార్య కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇది డబ్బింగ్ మూవీ కాదు. అన్ని భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. తెలుగులో కూడా మూవీ షూట్ చేశారు. ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం మేము ఈ సినిమాను ఈ కాంపిటీషన్ లో రిలీజ్ చేయాల్సివస్తోంది. చిన్న సినిమాకు టికెట్ ప్రైస్ రూ. 99 పెడుతున్నాం కానీ మోహన్ లాల్ వంటి స్టార్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాకు అలా చేయలేం. అన్నారు.
నటీనటులు – మోహన్ లాల్, సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————
ఎడిటింగ్ – కేఎమ్ ప్రకాష్
సినిమాటోగ్రఫీ – ఆంటోనీ సామ్ సన్
స్టంట్స్ – పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, నిఖిల్
సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి
డైలాగ్స్ -ఎస్ ఆర్ కే, జనార్థన మహర్షి, కార్తీక్
మ్యూజిక్ – సామ్ సీఎస్, అరియన్ మెహెదీ
రిలీజ్ – గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్
ప్రొడ్యూసర్స్ – శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా
కో ప్రొడ్యూసర్ – విమల్ లహోటి
డైరెక్టర్ – నందకిషోర్
