‘చాంపియన్’ బ్లాక్‌బస్టర్ విజయంతో యంగ్ హీరో రోషన్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. స్వప్న సినిమాస్…
‘ఈషా’ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ మిమ్మలను చాలా కాలం వెంటాడుతుంది: హీరో శ్రీవిష్ణు


సాధారణంగా హారర్ సినిమాలు థియేటర్‌లో ప్రేక్షకులను భయపెడతాయి. కానీ హారర్ కాన్సెప్ట్‌తో చేసిన ఈవెంట్ కూడా అక్కడికి వచ్చిన వారిని భయపెడుతుందని, ఓ హారర్ సినిమా చూసిన ఫీల్ ఉంటుందని మంగళవారం జరిగిన ఈషా హాంటెండ్ నైట్ ఈవెట్ ప్రూవ్ చేసింది. ఈషా చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్ త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర హాంటెండ్ నైట్, ప్రీరిలీజ్‌వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కథానాయకుడు శ్రీవిష్ణు బిగ్‌టికెట్‌ను లాంచ్‌చేస బిగ్ టికెట్‌ను లాంచ్ చేసి, ప్రేక్షకుని అంగీకార పత్రంపై శ్రీవిష్ణు సైన్ చేశారు. ఈ సందర్భంగా
శ్రీ విష్ణు మాట్లాడుతూ ” హారర్ సినిమాలు నాకు పర్సనల్‌గా ఇష్టం. హారర్ సినిమాలు థియేటర్‌లో ఫ్రెండ్స్‌తో చూసినప్పుడు థ్రిల్ల్‌గా ఫీలవుతాను. హారర్ సినిమా ఎక్స్‌పీరియన్స్ చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఈ ఈషా సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా రోజులు అందరిని వెంటాడుతుంది. సో.. అందరూ ఈ సినిమా చూసి అందరూ ఆ ఎక్స్‌పీరియన్ష్ పొందగలరు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె గారి కథల్లో నావెల్టీ ఉంటుంది. ఆయన కలిసినప్పుడు చాలా కథలు చెబుతుండేవాడు. ఈ కథ కూడా తప్పనిసరిగా నావెల్టీతో పాటు సినిమాలో మంచి ట్విస్టులు ఉండబోతున్నాయి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికి మంచి విజయం వస్తుందని ఆశిస్తున్నాను. మంచి అభిరుచి ఉన్న దామోదర ప్రసాద్ సమర్పకుడిగా ఉండటంతో ఈ సినిమా మీద అందరిలో అంచనాలు ఉంటాయి. ఇక బన్నీవాసు, వంశీ నందిపాటి మంచి టాలెంట్ ఉన్న టీమ్‌తో వాళ్ల ప్లానింగ్‌తో సపోర్ట్ చేస్తున్నారు. కొత్త వాళ్లను ఎంతో ఎంకరైజ్ చేస్తున్నారు. మంచి సినిమాలను మరో స్థాయికి తీసుకవెళతారు. ఈ సినిమాతో వాళ్లు మరో విజయం అందుకుంటారని అనుకుంటున్నాను’ అన్నారు.
కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ” కంటెంట్ ఉన్నసినిమాలే చేస్తాను. కంటెంట్‌తో పాటు మంచి టీమ్ కుదరిన తరువాత మంచి ప్రొడక్ట్ తీసుకొస్తాం. ఇక సినిమాను జనాలకు రీచ్ చేయడం మరో ఎత్తు. ఇప్పుడు జనాలకు సినిమాను రీచ్ చేసే బాధ్యతను బన్నీవాస్, వంశీ వాసు తీసుకొని ఓ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు వీరి వల్ల జనాలకు రీచ్ అయ్యిందని నమ్ముతున్నాను. ఇదొక హారర్ సినిమా, జనాలకు నచ్చుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాకు టిక్కెట్లు రేట్లు కూడా అందరికి అందుబాటులో ఉంటుంది.ఇలాంటి సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది. కథ సినిమా తరువాత దర్శకుడు ఎంతో ఓపికగా వెయిట్‌చేసి మంచి కంటెంట్‌తో ఈ సినిమా చేశాడు’ అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ ” శ్రీవిష్ణు మాకు లక్కీహ్యాండ్.. బంగారం లాంటి మనిషి ఆయన ఈ ఫంక్షన్‌కు రావడం హ్యపీగా ఉంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రేక్షకుని అంగీకార పత్రం సైన్ చేసి థియేటర్‌లోకి అడుగుపెట్టి భయపడాలి. తప్పని సరిగా ఈ సినిమాతో ప్రేక్షకుడిని భయపెట్టి, ఓ మీనింగ్ ఫుల్ మేసేజ్ ఇచ్చి.. ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటికి వస్తారు. ఈ సినిమా 99 రూపాయిలకే ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 24 నుంచి ప్రీమియర్స్ తో ఈసినిమాను విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా అందరిని భయపెడుతుంది. ఎంటర్‌టైన్ చేస్తుంది’ అన్నారు.
బన్నీ వాసు మాట్లాడుతూ ” వంశీ నందిపాటి సినిమాను భుజాల మీద తీసుకెళ్లి.. జనాలకు తీసుకవెళతారు. ఈ సినిమాను ప్రేక్షకులను రీచ్ చేయడం కోసం ఏమైనా చేస్తాడు. ఈ సినిమా కోసం వంశీ అన్ని చూస్తున్నాడు. ఈ సినిమా చూస్తుంటే అందరి వెన్నులో వణుకు పుడుతుంది. చిన్నప్పుడు దెయ్యాలు ఉన్నాయా లేవా అని తెలియడం కోసం నేను చాలా చేశాను. ఈ సినిమాను చూసిన తరువాత అప్పుడప్పుడు వెనక్కి చూసి భయపడుతున్నాను. అంతలా ఈ సినిమా అందర్ని వెంటాడుతుంది. హారర్ సినిమా లవర్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ప్రేక్షకులు భయపడి అరుస్తుంటారు.ఈ సినిమా పతాక సన్నివేశాలు అందర్ని షాకింగ్‌కు గురిచేస్తాయి. థియేటర్‌లో ఖచ్చితంగా అందరూ భయపడతారు. భయపడే గర్లఫ్రెండ్ ఉండే తీసుకొని వెళ్లండి. శ్రీ విష్ణు మా లక్కీ హ్యాండ్ ఆయన ఈ ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. మిత్రమండలి తరువాత కాస్త బ్రేక్ తీసుకుందామని.. ఫ్యామిలీతో టైమ్ గడుపుదామని అనుకున్నాను. కానీ వంశీ నందిపాటి నన్ను ఖాళీగా ఉంచకుండా… సినిమాలు చూపిస్తూ.. సినిమాలు తీసుకుంటున్నాడు. నేను సినిమాలకు బ్రేక్ ఇద్దామన్నా కుదరడం లేదు.
హీరో అఖిల్ మాట్లాడుతూ ” రాజు వెడ్స్ రాంబాయి సినిమాను హిట్‌చేసిన ప్రేక్షకులు నేను నటించిన ఈసినిమా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు థియేటర్‌లో చూడడానికి ఎదురుచూస్తున్నాను. నాకు హారర్ సినిమాలంటే భయం. అయినా ఈసినిమాను థియేటర్‌లో చూస్తాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. రాజు వెడ్స్ రాంబాయ్ తరువాత నా మరో సినిమా థియేటర్‌లోకి రావడం సంతోషంగా ఉంది. ఈసినిమాను అందరూ చూసి భయపడి..ఆ ఎమోషన్‌తో ఎంటర్‌టైన్ అవుతారని అనుకుంటున్నాను’ అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ ” శ్రీ విష్ణు లక్కీ హ్యాండ్ ఈ సినిమా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఓ సినిమా మాట్లాడితే.. ఆ తరువాత దర్శకుడు మాట్లాడాలి అని నమ్మే వ్యక్తిని. ఈ సినిమాను విడుదల వరకు తీసుకొచ్చినా.. అందరికి కృతజ్తతలు. ఈ సినిమాను అందరికి రీచ్ అవ్వడానికి వంశీ, వాసు గారు ఇచ్చిన ఇన్‌పుట్స్ నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. వాళ్లుచెప్నిన కరెక్షన్స్ ఈ సినిమాను వందశాతం ఫర్‌ఫెక్ట్‌గా రావడానికి దోహదపడ్డాయి అన్నారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ ” కథ ద్వారా దర్శకుడు శ్రీనివాస్‌మన్నె నన్ను హీరోని చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత దూరం వస్తానని ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా ఈ సినిమాలోకి నేను ఎంట్రీ అయ్యాను. ఈ సినిమాను అందరికి రీచ్ చేసిన బన్నీవాస్, వంశీ నందిపాటికి నా థ్యాంక్స్. దామోదర్ ప్రసాద్, వెంకట్‌లకు నా కృతజ్క్షతలు. ఈ సినిమాను చూస్తుంటే ఓ ఇంటర్నేషన్ హారర్ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిరి హనుమంతు, హెబ్బా పటేల్, నిర్మాత వెంకట్ తదితరలు పాల్గొన్నారు.
