‘చాంపియన్’ బ్లాక్‌బస్టర్ విజయంతో యంగ్ హీరో రోషన్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. స్వప్న సినిమాస్…
ఇంద్రా కంపెనీ బ్యానర్ పై కొర్రాల సుబ్బారెడ్డి ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్’ (వస్తే వదలం) ఫస్ట్ లుక్ లాంచ్


ఇంద్రా కంపెనీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4గా, కొర్రాల సుబ్బారెడ్డి కొత్త ప్రయత్నంగా తెరకెక్కుతున్న ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ (వస్తే వదలం)’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ క్రిస్మస్ పండగ సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీనగర్ కాలనీలోని రాంబాబు స్టూడియోలో లాంచ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా రామ సత్యనారాయణ గారు మాట్లాడుతూ –
“క్రిస్మస్ సందర్భంగా సుబ్బారెడ్డి డైరెక్టర్-నిర్మాతగా ఇంద్రా కంపెనీ బ్యానర్లో కొత్త సినిమా తీసేందుకు ముందుకు రావడం అభినందనీయం. కొత్త డైరెక్టర్లు, కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి అత్యవసరం. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిన్న బడ్జెట్ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అదే కోవలో ఈ చిత్రమూ పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శక-నిర్మాత కొర్రాల సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ –
“తెలుగు సినిమాల్లో యువతకు కనెక్ట్ అయ్యే కంటెంట్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఈ చిత్రంలో స్త్రీ భావప్రపంచం, ప్రేమ, నమ్మకం, ద్రోహం, క్రైమ్ – ఇవన్నీ సస్పెన్స్‌తో మిళితమై యూత్‌ఫుల్ రొమాంటిక్-క్రైమ్ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. నా కథకు ప్రధాన బలం, అన్ని వయసుల ప్రేక్షకులు ఈ కథతో కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను” అన్నారు.
ఇంద్రా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ:
“కెమెరామెన్ సూర్య ముంబై లో పెద్ద dop ఆయన అద్వర్యం లో అద్భుతమైన విజువల్స్ అందించ బోతున్నారు. సంగీత దర్శకులు విజయ్ బొల్లా & అర్జున్ దేవ్ సంగీతం యువతను అలరించేలా భావోద్వేగాలను పెంచేలా సిద్ధమౌతున్నాయి. షూటింగ్ హైదరాబాద్ & గోవా ప్రాంతాల్లో మార్చి నుండి రెగ్యులర్‌గా జరుగుతుంది” మరొక హీరోయిన్ కూడా తెలుగు చిత్రసీమకు పరిచయంచెయ్య బోతున్నాము అని తెలిపారు.
⭐ టీమ్ వివరాలు
హీరో: మదన్ బాబు
హీరోయిన్స్: ప్రియాంక, సుష్మ, వి.జి.ఆర్. సాక్షి, మహీరా
ఇతర నటులు: ఇమామ్ వలి, సునీత, అంకెల గోపాలకృష్ణ, ఫణి
దర్శక-నిర్మాత: కొర్రాల సుబ్బారెడ్డి
కో-ప్రొడ్యూసర్: రవీ రాథోడ్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కమలాకర్
కెమెరా: సూర్య
సంగీతం: విజయ్ బొల్లా & అర్జున్ దేవ్
డాన్స్ మాస్టర్లు: సాగర్ మాస్టర్, తాటిపల్లి హరికుమార్ మాస్టర్
ఎడిటింగ్: రాంబాబు స్టూడియో
PRO: రాంబాబు మీడియా హౌస్
