ఘనంగా ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ ట్రైలర్ లాంచ్ & ప్రీ-రిలీజ్ ఈవెంట్
జూన్ 12న థియేటర్స్ లోకి ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ హైదరాబాద్: తండ్రి-కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని K ఫిలిమ్స్ బ్యానర్ పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్‌నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని…
