Skip to content

‘ఈషా’ బ్లాక్‌బస్టర్‌ విజయం క్రెడిట్‌ ప్రేక్షకులదే..కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని మరోసారి ఫ్రూవ్‌ చేశారు: వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి వంటి బ్లాక్‌బస్టర్స్‌ అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘ఈషా’అనే హారర్‌ థ్రిల్లర్‌ను అందించారు. ఈ క్రిస్మస్‌కు విడుదలైన ఈ చిత్రం ఈ క్రిస్మస్‌ విజేతగా నిలిచింది. అఖిల్‌రాజ్‌ త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకెళుతోంది. ఈనేపథ్యంలో చిత్ర టీమ్‌ బ్లాక్‌బస్టర్‌ మీట్‌ను నిర్వహించారు.

నిర్మాత బన్నీవాస్‌ మాట్లాడుతూ ” ఒక సినిమా హిట్‌ అనడానికి వసూళ్లు ప్రామాణికం, ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రెండు కోట్ల 20 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది. చిన్న చిత్రాల్లో ఇది రికార్డు. చాలా చిన్న బడ్జెట్‌తో తీసిన చిత్రమిది. రెండో రోజు కలెక్షన్లు ఈసినిమా తగ్గలేదు. ఈ హాలీడేస్‌లో ఈ సినిమా గట్టి వసూళ్లు ఉంటాయి. ఈ సినిమాపై ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ చిత్రం వసూళ్లు చూస్తే వాళ్ల సందేహాలు తీరిపోతాయి. ఫైనల్‌గా బాక్సాఫీస్‌ విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక ఆడియన్స్‌ థియేటర్స్‌కు వచ్చి ఈషా సినిమాను ఎంకరైజ్‌ చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు.

నిర్మాత వెంకటేశ్వరరావుమాట్లాడుతూ ” ఈ సినిమా ఇంత గొప్ప సక్సెస్‌ సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆర్టిస్టులందరూ ఎంతో ఇష్టంతో పనిచేశారు.వారికి ఈ సినిమాతో మంచి విజయం దక్కింది. ఈ సినిమా విజయంలో బన్నీవాస్‌, వంశీనందిపాటి, దాము గారు ముఖ్య కారణం’ అన్నారు.

త్రిగుణ్‌ మాట్లాడుతూ తెలుగు సినిమాకు ఈ సినిమాకు మంచి వీకెండ్‌ ఇది. నా సినిమాకు ఇంత మంచి కలెక్షన్లు ఈమధ్య కాలంలో రాలేదు. నాకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్‌ గారు ఈ సినిమా రూపంలో నాకు మరో విజయాన్ని ఇచ్చారు. మౌత్‌టాక్‌తో సినిమా రోజు రోజు కలెక్షన్లు పెరుగుతున్నాయి, ఈ రోజు ఈ సినిమా ఇంత విజయానికి కారణమైన బన్నీ వాస్‌, వంశీ నందిపాటిలు ఇలాగే చిన్న సినిమాలను సపోర్ట్‌ చేయాలి’ అన్నారు.

నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ ” ఈ వేడుకకు చీఫ్‌గెస్ట్‌లు ఆడియన్స్‌. వాళ్లుథియేటర్ప్‌లో ఉండి సినిమాకు విజయాన్ని ఇచ్చారు. వాళ్లకు రుణపడి ఉన్నాను. ఇది కేవలం హారర్‌ ఫిలిం కాదు. పతాక సన్నివేశాలు అందర్నిఆలోచింపజేస్తాయి. ఈషా పీపుల్స్‌ బ్లాక్‌బస్టర్‌. ఈ విజయం ఆడియన్స్‌దే’ అన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ ” ఈ సినిమాకు బ్లాక్‌టిక్కెట్స్‌ అమ్ముతున్నారు. చాలా ఏళ్ల తరువాత ఈ విషయాన్ని విన్నాను. కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని ఈ సినిమా మరోసారి ప్రూవ్‌ చేసింది. ఇది తెలుగు ప్రేక్షకుల విజయం’ అన్నారు.