Skip to content

యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా ఉంటుంది – డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు ధీరజ్ మొగిలినేని.

– పదిహేను రోజుల క్రితం “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా చూశాను. మూవీ బాగా నచ్చింది. ప్రమోద్ అన్నకు వంశీ అన్నకు కాల్ చేసి ఈ సినిమా నేను డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నా అని అడిగాను. వారు ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. ఇది చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే మంచి లవ్ స్టోరీ మూవీ. టైటిల్ చూసి ఇదోదే ఓన్లీ యూత్ చూడాల్సిన సినిమా అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. శివ, మిత్ర అనే రెండు క్యారెక్టర్స్ జర్నీ చూస్తారు.

– “కపుల్ ఫ్రెండ్లీ” మూవీలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి కేవలం 15 నిమిషాలు మాత్రమే సీన్స్ ఉంటాయి. మిగతా అంతా మిత్ర, శివ అనే జంట ఒకరికొకరు పరిచయం అయ్యాక వారి జీవితాలు ఎలా మారాయి. వీళ్లు ఒకరి కొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు అనేదే చూపిస్తున్నాం. హీరో నెల్లూరు నుంచి వచ్చి చెన్నైలో ఇంటీరియర్ డిజైనర్ గా సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. హీరోయిన్ చిత్తూరు నుంచి చెన్నై జాబ్ కోసం వస్తుంది. వీళ్లు కలిశాక ఏమైంది అనేది కథ

– హీరోయిన్ ప్రతి సందర్భంలో చెప్తాను చెప్తాను అని హీరోతో అంటూ ఉంటుంది. కొంచెం సస్పెన్స్ దాచేందుకే ఆమె అలా చెబుతుంటుంది. ఈ సినిమా టైటిల్ విషయంలో సెన్సార్ అభ్యంతరం చెప్పారు. టైటిల్ మార్చమని అన్నారు. కానీ మేము ఇప్పుడు టైటిల్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేమని చెప్పాం. టైటిల్ రిజిస్ట్రేషన్ విషయంలో మొదటి నుంచే సెన్సార్ వారి అనుమతి ఇచ్చేలా ఒక కొత్త పద్ధతి రావాల్సిన అవసరం ఉంది. మాకే కాదు ఈ మధ్య చాయ్ వాలా అనే సినిమాకు కూడా సెన్సార్ వారు అభ్యంతరం తెలిపారు.

– “కపుల్ ఫ్రెండ్లీ”లో శివ పాత్రలో సంతోష్ శోభన్ పర్ ఫార్మెన్స్ మనందరికీ చాలా నచ్చుతుంది. ఎంతో సెటిల్డ్ గా ఆయన నటించారు. సంతోష్ శోభన్ కు మంచి హిట్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ సినిమాతో ఆయనకు హిట్ రావాలి. అలాగే మంచి స్టార్ కావాలని మేము కోరుకుంటున్నాం. సంతోష్ లాంటి యంగ్ హీరోలకు సక్సెస్ వస్తే వాళ్లు మరిన్ని మూవీస్ చేస్తారు. ఇండస్ట్రీ బాగుంటుంది.

– ఈ సినిమా కోసం చెన్నై నగరంలో షూటింగ్ చేశారు. చెన్నైలో షూటింగ్ చేయడం చాలా కష్టం. పర్మిషన్స్ ఇవ్వరు. తమిళ చిత్రాలకు కూడా పర్మిషన్స్ ఉండవు. కానీ ఈ సినిమా టీమ్ మాత్రం గెరిల్లా పద్ధతిలో షూటింగ్ చేశారు. ఇటీవల మేము చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం చెన్నైలో ఇలాగే షూటింగ్ చేయాల్సివచ్చింది.

– “కపుల్ ఫ్రెండ్లీ” ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండే మంచి లవ్ స్టోరీ. మేము మా చిత్రాలతో ప్రేక్షకులు ఎమోషన్ తో ఏడిపిస్తాం. అయితే ఈ చిత్ర దర్శకుడు అశ్వన్ ప్రేక్షకుల్ని ఏడిపించలేదు గానీ హార్ట్ టచింగ్ గా మూవీ చేశారు. ఆయన ఈ సినిమాకు చేసిన స్క్రిప్ట్ పర్పెక్ట్ గా ఉంది. ప్రతి సీన్ కు మరొక సీన్ తో లింకు ఉండేలా పక్కాగా స్క్రిప్ట్ చేసుకున్నారు. స్క్రిప్ట్ తో పాటు ఆ కథను అందరికీ నచ్చేలా తెరకెక్కించారు. అయితే సినిమా చూశాక మేము ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ లో ఉంటే ఇంకో పది పర్సెంట్ ఇంటెన్స్ గా చేయగలిగి ఉండేవాళ్లం. డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మూవీలో మార్పులు చెప్పడం కరెక్ట్ కాదు. ఇది డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్ హౌస్ మొదటి నుంచి నమ్మి చేసిన కథ.

– నా మనసుకు నచ్చిన మూవీస్ ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. ఎలాంటి హర్రీ లేకుండా బాగుంది అనిపించినవే పంపిణీ చేస్తాను. ఇప్పుడు మా కపుల్ ఫ్రెండ్లీ మూవీకి సితార వారి ఫంకీ మూవీకి మధ్య పోటీ ఉంది. థియేటర్స్ విషయంలోనూ కాంపిటేషన్ కనిపిస్తోంది. వాలెంటైన్స్ డే కు మనసంతా నువ్వే, లవ్ స్టోరీ రిలీజ్ అవుతున్నాయి. మాది కొత్త సినిమా కాబట్టి మా మూవీకి ఉండే ఆడియెన్స్ మాకుంటారు. ఆ చిత్రాలకు ఉండే ఆడియెన్స్ వాటికి ఉంటాయి. రీ రిలీజ్ అంటే ఆ ప్రొడ్యూసర్స్ ఇష్టం. అయితే ఐదారుగురు స్టార్ హీరోల విషయంలో తప్ప మిగతా హీరోలకు రీ రిలీజ్ లు పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించడం లేదు.

– ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ జరుగుతోంది. సంగీత్ శోభన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అలాగే చిన్న పిల్లలతో ఓ చిల్డ్రన్ మూవీ చేస్తున్నాం. అది సమ్మర్ లో రిలీజ్ చేస్తాం. కొందరు స్టార్ హీరోలతో స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఒక స్టార్ తో మా సంస్థలో మూవీ అనౌన్స్ చేస్తాం.