తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో ఈటీవి విన్ సత్తా చాటింది. ఈవిన్…
స్టార్ హీరోయిన్ నభా నటేష్ కవర్ పేజీ పబ్లిష్ చేసిన ప్రముఖ మేగజైన్ షీ ఇండియా


ఈరోజు ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ప్రముఖ మేగజైన్ షీ ఇండియా స్టార్ హీరోయిన్ నభా నటేష్ ను తన కవర్ పేజీగా పబ్లిష్ చేసింది. నభా నటేష్ తన యాక్టింగ్ జర్నీతో ఎంతోమంది వుమెన్ ను ఇన్స్ పైర్ చేస్తోందని ఈ సందర్భంగా కవర్ పేజీ స్టోరీలో ప్రచురించారు. నభా తన గ్రేస్, గ్లోరీతో ఆకట్టుకుంటోందని, ఆమె అన్ స్టాపబుల్ గా తన కెరీర్ కొనసాగిస్తోందని షీ ఇండియా మేగజైన్ ప్రశంసించింది.
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది నభా నటేష్. అందం, ప్రతిభ కలగలిపిన నటిగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ నాయిక్ ప్రస్తుతం రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. స్వయంభు, నాగబంధం చిత్రాలతో మరోసారి తన సత్తా చాటబోతోందీ అందాల తార.
