Skip to content

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” టైటిల్ గ్లింప్స్ రిలీజ్ Telugu News

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ “పోచమ్మ” ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ టైటిల్ గ్లింప్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. ‘మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది..’ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసిన “పోచమ్మ” సిరీస్ టైటిల్ గ్లింప్స్ ఆసక్తిరేపుతోంది. ఇంటెన్స్ మ్యూజిక్ బీజీఎం ఈ గ్లింప్స్ పై ఇన్ స్టంట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. “పోచమ్మ” టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ సిరీస్ ను మూవీగా థియేట్రికల్ రిలీజ్ చేయాలని నెటిజన్స్ సూచిస్తున్నారు.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు డివైన్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన “పోచమ్మ” వెబ్ సిరీస్ ఆడియెన్స్ కు ఒక సరికొత్త ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు, స్ట్రీమింగ్ తేదీ త్వరలో ఆహా వెల్లడించనుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.