-“లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను: నిర్మాత…
విజయ్ సేతుపతి చేతుల మీదుగా ‘డోంట్ స్లీప్’ ఫస్ట్ లుక్ రిలీజ్


మలయాళ సినిమా తన సహజమైన కథనం, సాంకేతిక నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అగ్రశ్రేణి మలయాళ చిత్రనిర్మాతలు ఇప్పుడు ప్రముఖ తెలుగు స్టార్లతో కలిసి పనిచేస్తున్నారు. ‘మిన్నల్ మురళి’ ఫేమ్ బాసిల్ జోసెఫ్, అల్లు అర్జున్‌తో ఒక సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతుండగా, ‘కిష్కింధ కాండం’, ‘ఏకో’ చిత్రాలతో పేరుగాంచిన దిన్‌జీత్ అయ్యతన్, ప్రభాస్‌తో ఒక ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తెలుగులో యూనిక్ సైకలాజికల్ థ్రిల్లర్ వస్తోంది. గతంలో మలయాళ-తమిళ ద్విభాషా థ్రిల్లర్ మమ్ముట్టి ‘స్ట్రీట్ లైట్స్’కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్, ఇప్పుడు ‘చౌర్య పాఠం’లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా నటిస్తున్న ఈ కొత్త చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వి. చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2 గా నిర్మిస్తున్నారు.
ఈరోజు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ‘డోంట్ స్లీప్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్, “The longer you sleep, the closer he gets” అనే ట్యాగ్‌లైన్ క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్-లుక్ పోస్టర్ లో రవీంద్ర విజయ్ పాత్ర, తుపాకీతో మంచు పర్వతాల మీదుగా ఇంద్ర రామ్‌ను వెంబడిస్తుండగా, ముందు భాగంలో హీరో కళ్ళు మూసుకుని, నుదుటిపై కట్టుతో కనిపించడం ఆసక్తికరంగా ఉంది.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి పనిచేసిన మోనికా-రామకృష్ణ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని గోకుల్ హర్షన్ అందించారు, ఈయన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర
