Skip to content

మంగ్లీ కేసుతో నాకు సంబంధం లేదు – డైరెక్టర్ వేణు ఊడుగుల

  • MOVIES
  • Vishwanath
మంగ్లీ కేసుతో నాకు  సంబంధం లేదు – డైరెక్టర్ వేణు ఊడుగుల Telugu News

ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఈ అసత్య వార్తలపై వివరణ ఇచ్చారు దర్శకుడు వేణు ఊడుగుల. మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

వేణు ఊడుగుల స్పందిస్తూ – గాయని మంగ్లీ కేసులో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న వార్తలు చూసి బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా పాత్ర. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో కూడా నిందితుడిగా నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదని నిర్థారించారు. మీ వార్తల వల్ల ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ప్రభావితం అవుతాయని మీడియా మిత్రులు గమనించగలరు. మీరు నాపై ఇంతకాలం చూపిన ప్రేమ, ఆదరణ నాకెంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడూ అదే ప్రేమను కొనసాగిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.