Skip to content

రెండు సంవత్సరాల కష్టం, క్రమశిక్షణతో అద్భుత ట్రాన్స్‌ఫర్మేషన్ – సర్‌ప్రైజ్‌కు సిద్ధమైన శర్వా

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ మూవీ బైకర్ కోసం అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. వ్యక్తిగతంగా, క్రియేటివ్‌గా తనను మళ్లీ ఛాలెంజ్ చేసే పాత్ర బైకర్ రూపంలో వచ్చింది. ఇందులో అతను 18 ఏళ్ల రేసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం అతను తన శరీరాన్ని, మనసును పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.

ఇప్పటికే మేకర్స్ శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోను విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఒకసారి కమిట్ అయిన తర్వాత శర్వా పూర్తిగా తనను డెడికేట్ చేశారు. ఉదయం సూర్యోదయం కంటే ముందే మొదలయ్యే రోజు, అలసటతో ముగిసేది. లాంగ్ డిస్టెన్స్ పరుగులు, కఠినమైన స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మొబిలిటీ సెషన్స్‌తో అతను తన పరిమితులను దాటాడు. ఇది కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఛాలెంజ్ గా మారింది.

ఈ ప్రయాణంలో యోగా అతనికి కీలకంగా నిలిచింది. జిమ్ అతనికి బలం, సహనం ఇచ్చినప్పుడు, యోగా అతని ఆలోచనలను ప్రశాంతం చేసి, ఫోకస్‌ను పెంచింది. ఈ ఫెరోసిటీ, ప్రశాంతత కలయికే అతని మార్పుకు బలం అయింది. దీంతో అతను బరువు తగ్గి, మరింత షార్ప్ లుక్‌తో పాటు కొత్త కాన్ఫిడెన్స్‌ను పొందారు.

బైకర్ ఏప్రిల్ 3 విడుదలకు సిద్ధమవుతుండగా, శర్వా కొత్త అవతార్‌కి అద్భుత స్పందన వస్తోంది.

శర్వా మాట్లాడుతూ.. షూటింగ్ మొదటి రోజు అద్దంలో చూసుకున్నప్పుడు, నేను సిద్ధంగా ఉన్న, క్రమశిక్షణతో ఉన్న, అప్‌డేటెడ్ వ్యక్తిని చూశాను. ఈ ప్రయాణం నాకు ఒక విషయం నేర్పింది..ఎంత నిరాశలో ఉన్నా.. ఒక నిర్ణయం తీసుకుంటే పూర్తిగా మారిపోవచ్చు. ఏప్రిల్ 3న మీరు స్క్రీన్‌పై విక్కీ�