Skip to content

పెద్ది పహిల్వాన్’ అవతార్‌తో ఆశ్చర్యపరిచిన రామ్ చరణ్

పెద్ది పహిల్వాన్’ అవతార్‌తో  ఆశ్చర్యపరిచిన  రామ్ చరణ్ Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం చేసిన ఫియర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ స్పెషల్ గ్లింప్స్‌తో పాటు వచ్చిన పోస్టర్లు ఆయనను పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించాయి. పహిల్వాన్ లుక్‌లో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులని సర్ప్రైజ్ చేసింది. ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ విడుదలైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ తో దేశవ్యాప్తంగా నెం.1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
ఈ సినిమాలో చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ పూర్తిగా రా అండ్ ఫెరోషియస్‌గా కనిపిస్తోంది. నిజమైన ఫైటర్‌లా కనిపించే బలమైన భుజాలు, చేతులు, భారీ ఛాతీ, కండలు తిరిగిన దేహంతో అసలైన పహేల్వాన్‌గా కనిపించారు.
రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విజువల్స్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను మరింత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ముందుకు దూసుకెళ్లే సీన్స్‌లో, గదను పట్టుకుని కూర్చునే షాట్స్‌లో, హనుమాన్ ప్రేరణతో వచ్చిన యోధుడిలా ఆయన ఆగ్రహం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుమ్ము ఎగిరే ఫ్రేమ్స, నరాలు బిగుసుకునే ఎఫర్ట్, కళ్లలో కనిపించే ఫైర్ అన్నీ కలిపి ఒక థండరస్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయి.
ఇది కేవలం ఒక మేకోవర్ కాదు.. బలం, క్రమశిక్షణ, మైథిక్ పవర్ కి ప్రతీకలా నిలిచే పాత్ర. ఈ గ్లింప్స్‌తో పెద్ది సినిమా స్కేల్, మాస్ ఇంపాక్ట్, హై వోల్టేజ్ ఎలివేషన్ ఎంత భారీగా ఉండబోతుందో స్పష్టమవుతోంది.
దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా, మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంటేషన్‌లో, సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో భారీ కాన్వాస్‌పై రూపొందుతోంది

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.