Skip to content

తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ రెవెన్యూ – బన్నీ వాస్

  • MOVIES
  • Vishwanath
తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ రెవెన్యూ – బన్నీ వాస్ Telugu News

తెలుగులో సినిమాలు నిర్మించాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్. టొవినో థామస్ కొత్త సినిమా పళ్లిచట్టంబిని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు బన్నీ వాస్. ఈ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న బన్నీ వాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో విజయవంతమైన సినిమా ద్వారా నిర్మాతకు దక్కుతున్న థియేట్రికల్ రెవెన్యూ మలయాళంలో చూస్తే తక్కువగా ఉంటోందని ఆయన అన్నారు. మలయాళం థియేట్రికల్ రెవెన్యూతో అక్కడి నిర్మాతలు హ్యాపీగా ఉన్నారని ఆయన చెప్పారు. తెలుగులో థియేటర్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బాగుండాలనే ప్రయత్నంలో భాగంగానే వీలైనన్ని ఇతర భాషల చిత్రాలను తెలుగులోకి తీసుకొస్తున్నట్లు బన్నీ వాస్ చెప్పారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – మనకు తెలిసిన వాళ్లు మలయాళంలో మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారంటూ డైరెక్టర్ మారుతి ఈ ప్రొడ్యూసర్స్ టీమ్ ను పరిచయం చేశారు. వాళ్లతో మాట్లాడిన తర్వాత ఒక ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్నారని తెలిసింది. కొచ్చి తీసుకెళ్లి ఈ సినిమా చూపించారు. మన తెలుగు వాళ్లు కేరళ వెళ్లి ఇలాంటి ఒక భారీ చిత్రాన్ని నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమా టెక్నికల్ చాలా క్వాలిటీగా హ్యూజ్ గా ఉంటుంది. తెలుగు ఆడియెన్స్ కు ఒక కొత్త కమర్షియల్ మూవీ అవుతుంది. మలయాళం మూవీస్ అంటే మనం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ గాన భావిస్తాం కానీ పళ్లిచట్టంబి ఒక భారీ మంచి కమర్షియల్ మూవీ. తెలుగులో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. అయితే వెంటనే తెలుగు సినిమా చేయకండి. తెలుగులో సినిమా నిర్మించాలంటే చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. మలయాళంలో చిత్ర నిర్మాణంలో ఉన్న కంఫర్ట్ తెలుగులో లేదు. సీనియర్ ప్రొడ్యూసర్ గా మీకు ఈ సలహా ఇస్తున్నా. ఎందుకంటే తెలుగులో ఓ సినిమా సక్సెస్ అయితే వచ్చే ఆదాయం కన్నా, మలయాళంలో ఒక మూవీ సక్సెస్ అయితే వచ్చే ఆదాయం ఎక్కువ. మలయాళంలో వచ్చినన్ని థియేట్రికల్ రెవెన్యూస్ మన తెలుగులో రావడం లేదు. మా దగ్గరకు పదేళ్ల క్రితం వచ్చి మాతో ట్రావెల్ అయిన మేఘశ్యామ్ ఈ సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. టొవినో గారు చేసిన 2018 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాం. మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో ఆయన పర్ ఫార్మెన్స్, ఫైట్స్ ఆకట్టుకుంటాయి. నాకు మోహన్ లాల్ గారిని చూసినట్లు అనిపించింది. కయదు లోహర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. డ్రాగన్, ఫంకీ సినిమాలతో మీరు తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యారు. పళ్లిచట్టంబి సినిమాతో తెలుగులో మీరు నెక్ట్స్ రైజింగ్ స్టార్ అవుతారు. తెలుగులో మరింత మంచి పొజిషన్ కు చేరుకుంటారు. ఈ సినిమా చూసిన తర్వాత కయదుతో మరోసారి మీరంతా లవ్ లో పడతారు. ఈ సినిమా తర్వాత కయదుకు మరింతమంది ఫ్యాన్స్ పెరుగుతారు. డైరెక్టర్ ఈ మూవీని తీసిన విధానం, ఎడిటింగ్ చేయించిన విధానం బాగా నచ్చింది. ఒక న్యూ కమర్షియల్ మూవీ చూడాలంటే పళ్లిచట్టంబి థియేటర్స్ లో చూడండి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా నుంచి టైటిల్, పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు సినిమాకు భాషా హద్దులు లేవు. తెలుగు సినిమా పాన్ వరల్డ్ సినిమా అయ్యింది. ఇక్కడికి వీలైనన్ని ఇతర భాషల చిత్రాలు తీసుకురావాలి. అప్పుడే డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ వ్యవస్థ బాగుంటుంది అని నాకు సాధ్యమైనన్ని మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తున్నా. ఈ సినిమాకు మాత్రం స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది. అన్నారు.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.