“క” సినిమాకు గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ గెల్చుకున్న దర్శకద్వయం సందీప్, సుజీత్
కిరణ్ అబ్బవరం హీరోగా "క" చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని అందుకున్న దర్శకులు సందీప్, సుజీత్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో సందీప్, సుజీత్ లకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనౌన్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ దక్కడం ఈ దర్శకుల ప్రతిభకు లభించిన సరైన గౌరవంగా చెప్పుకోవచ్చు. "క" మూవీ టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తమ సంతోషాన్ని షేర్ చేసుకుంది. క" చిత్రంతో దర్శకులు సందీప్, సుజీత్ తమ ప్రయత్నంలోనే ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. గతేడాది దీపావళికి రిలీజైన "క" సినిమా బ్లాక్…