సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్…
“లీడ్ ఆన్ గాంధీ” రిలీజ్

జనవరి 30, 2026 అమరవీరుల దినోత్సవం నాడు, కమల్ హాసన్, గోపాల కృష్ణ గాంధీ సందేశాలతో రూపొందిన “లీడ్ ఆన్ గాంధీ” అనే పవర్ ఫుల్ డాక్యుమెంటరీ విడుదలైంది. భారతదేశ నైతికత, ప్రజాస్వామ్య విలువల నుంచి పుట్టిన గొంతులు ఇందులో ఇంటెన్స్ గా వినిపిస్తాయి.
ఈ డాక్యుమెంటరీ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని హతమార్చిన బుల్లెట్ ప్రయాణాన్ని ఇటలీ గనుల నుంచి, న్యూఢిల్లీ బిర్లా హౌస్ వరకు చూపించిన తీరు ఆలోచన రేకెత్తించేలా వుంది. ఒకే ఒక బుల్లెట్ కథ ద్వారా, హింస ఎలా దేశాలు, సరిహద్దులు దాటుతుందో, శాంతి ఆలోచనలు మాత్రం ఎంత కష్టంగా ప్రయాణిస్తాయో ఈ ఫిల్మ్ స్పష్టంగా చూపిస్తుంది.
ఇది కేవలం చరిత్రాత్మక డాక్యుమెంటరీ కాదు, 1948 జనవరి 30న మనం ఏమి కోల్పోయామో ఆలోచింపజేసే ఫిల్మ్. నేటి ప్రపంచంలో విభజన, అసహనం సాధారణమవుతున్న సమయంలో అహింసను బలహీనతగా చూసినప్పుడు ఏమవుతుంది? గాంధీ చూపిన నైతిక ధైర్యాన్ని సమాజం మరిచితే పరిణామాలు ఏంటి? అనే అవసరమైన ప్రశ్నలని ఈ ఫిల్మ్ సంధిస్తోంది.
కమల్ హాసన్ దృష్టికోణం ద్వారా, ఈ చిత్రం గాంధీజీ హత్యను నేటి కాలంతో అనుసంధానిస్తూ, కోపం-ప్రతీకారాలకన్నా ప్రేమ, సత్యం, ఆత్మనియంత్రణకు ఎక్కువ ధైర్యం అవసరమని గుర్తు చేస్తుంది.
అమరవీరుల దినోత్సవం నాడు విడుదలైన “లీడ్ ఆన్ గాంధీ” జాతిపితకు నివాళిగా మాత్రమే కాకుండా ప్రజాజీవితంలో సానుభూతి, సంభాషణ, అహింస విలువలను తిరిగి గుర్తు చేసుకునేలా చేసే ఒక బలమైన పిలుపు.
గాంధీజీ అనే మనిషిని బుల్లెట్ చంపింది, కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ నిలిచిపోతాయని ఈ డాక్యుమెంటరీ గుర్తు చేస్తుంది.
