50 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహన్ బాబు
ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యా వేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కలెక్షన్ కింగ్ డా. ఎం. మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నవంబర్ 22న ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఈ అసాధారణ ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో నవంబర్ 22న ‘MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది దిగ్గజ నటుడిని, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు విష్ణు మంచు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా డాక్టర్ మోహన్ బాబు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. తన శక్తివంతమైన…
