- ఆగస్ట్ 8న తమిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద…
#ChiruBobby2 అనౌన్స్మెంట్

బ్లాక్‌బస్టర్ కాంబో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి రీయూనియన్‌కి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రోజు మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. ప్రతిష్టాత్మక KVN సంస్థ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించనుంది. మెగాస్టార్ వింటేజ్ మాస్ స్పెక్టాకిల్తో రికార్డులు బద్దలు కొట్టిన వాల్తేరు వీరయ్య తర్వాత ఇది మరో సెన్సేషనల్ కాంబినేషన్‌గా నిలవనుంది.
చిరంజీవి లార్జర్-దెన్-లైఫ్ పర్సోనాను అద్భుతంగా స్క్రీన్‌పై చూపించగల డైరెక్టర్‌గా పేరొందిన బాబీ, ఈసారి రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌తోనే మ్యాసీవ్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు. గోడను బలంగా కొడుతున్న గొడ్డలి, దాని క్రింద “The blade that set the bloody benchmark” అనే ట్యాగ్‌లైన్ రాబోయే సినిమా ఎంత పవర్ ఫుల్, ఇంటెన్స్‌గా ఉండబోతోందో ప్రజెంట్ చేస్తోంది.
చిరంజీవిని ఎప్పుడూ చూడని కొత్త క్యారెక్టర్లో ప్రెజెంట్ చేయడానికి బాబీ పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు. పోస్టర్, ట్యాగ్‌లైన్ చూస్తేనే ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందని ప్రామిస్ చేస్తోంది.
తమిళంలోవిజయ్ జననాయకన్, టాక్సిక్, బాలన్ వంటి వరుస బ్లాక్బస్టర్లతో దూసుకుపోతున్న KVN ప్రొడక్షన్స్, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో తొలిసారి తెలుగు సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత యాక్టివ్ & డైనమిక్ ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచిన KVN, మెగాస్టార్‌తో ఈ మాస్ ఎంటర్టైనర్ని మ్యాసీవ్ స్కేల్ లో రూపొందిస్తోంది.
ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ మొదలుకానుండగా అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
సినిమా సంబంధిత మరిన్ని అప్డేట్స్ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు