Skip to content

‘ఇరుముడి’ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. సినిమా థియేట్రికల్ సక్సెస్‌ను పురస్కరించుకుని ‘ఇరుముడి’ కోర్ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరంజీవి, వారిని వ్యక్తిగతంగా అభినందించారు. రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సందర్భంగా వారితో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా విడుదలైన ఫొటోల్లో చిరంజీవి, ‘ఇరుముడి’ టీమ్ మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం కనిపించింది. బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ అంచనాలను మించి అద్భుతమైన విజయాన్ని అందుకుంటూ, సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రాల్లో ఒకటిగా…

Read more

షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది: మెగాస్టార్ చిరంజీవి

‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏

Read more

‘కొరియన్ కనకరాజు’ మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు: మెగాస్టార్ చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయం సాధిస్తే…

Read more
అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన Telugu News

అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్ కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా…

Read more
#ChiruBobby2 అనౌన్స్‌మెంట్ Telugu News

#ChiruBobby2 అనౌన్స్‌మెంట్

బ్లాక్‌బస్టర్ కాంబో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి రీయూనియన్‌కి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రోజు మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. ప్రతిష్టాత్మక KVN సంస్థ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించనుంది. మెగాస్టార్ వింటేజ్ మాస్ స్పెక్టాకిల్‌తో రికార్డులు బద్దలు కొట్టిన వాల్తేరు వీరయ్య తర్వాత ఇది మరో సెన్సేషనల్ కాంబినేషన్‌గా నిలవనుంది. చిరంజీవి లార్జర్-దెన్-లైఫ్ పర్సోనాను అద్భుతంగా స్క్రీన్‌పై చూపించగల డైరెక్టర్‌గా పేరొందిన బాబీ, ఈసారి రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌తోనే మ్యాసీవ్ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేశారు. గోడను బలంగా కొడుతున్న గొడ్డలి, దాని క్రింద “The blade that set the bloody benchmark” అనే ట్యాగ్‌లైన్ రాబోయే సినిమా ఎంత…

Read more