Skip to content

3 రోజుల్లో వరల్డ్ వైడ్ 5.42 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ”

  • MOVIES
  • Vishwanath
3 రోజుల్లో వరల్డ్ వైడ్ 5.42 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ” Telugu News

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ హార్ట్ టచింగ్ ప్రేమ కథ మూడు రోజుల్లోనే 5.42 కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ వంటి స్టార్స్ ప్రశంసలు అందిస్తున్నారు. మూవీ టీం చేస్తున్న ప్రమోషనల్ టూర్ కూడా ప్రేక్షకుల్లోకి సినిమాను బాగా తీసుకెళ్తోంది.
“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.
నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.