Skip to content

“డార్క్ నైట్” మార్చ్13న థియేటర్లలో రిలీజ్

పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “డార్క్ నైట్”. మార్చ్13న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. జి.ఆర్. ఆదిత్య ఈ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించారు. పూర్ణ ఇందులో హేమ పాత్రలో నటించి కథకు కీలకంగా నిలిచే పాత్రను పోషించారు. ఆమెతో పాటు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రోషన్‌గా, విధార్థ్ అలెక్స్‌గా, సుభాశ్రీ రాయగురు సోఫియా పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆథిత్యా, సంగీత దర్శకుడు మిస్కిన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి :
“పూర్ణ ప్రదాన పాత్రలో నటించిన “డార్క్ నైట్” చిత్రం మార్చ్13న రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విదుదల చేస్తున్నాం. డార్క్ నైట్ నాలుగు ప్రధాన పాత్రల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారి మధ్య ఉన్న సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు భావోద్వేగాలతో నిండిన ప్రయాణాన్ని అనుభవిస్తారు. ఈ చిత్రంలో అతీంద్రియ అంశాలతో కూడిన ఒక ఊహించని ట్విస్ట్ కథను కొత్త మలుపు తిప్పుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. మిస్కిన్ ప్రత్యేకమైన సిగ్నేచర్ BGM తో ఈ చిత్రం భావోద్వేగం, సస్పెన్స్‌ల సమ్మేళనంగా నిలుస్తూ “డార్క్ నైట్”ను మరపురాని సినిమాటిక్ అనుభవంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తానికి, కథ చెప్పే విధానం, భావోద్వేగాలు మరియు ఉత్కంఠతో కూడిన అంశాలతో “డార్క్ నైట్” ప్రేక్షకులను ఎమోషనల్ థ్రిల్ ఇస్తూ రెండు గంటలపాటు ఉత్కంటభరితంగా పాత్రలతో మమేకం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్లోనున్న యూత్ కు సంభందించిన అంశాలు హైలెట్ గా వారి అనుభవాలను ప్రతిబింబిస్తాయి.” అన్నారు.

తారాగణం : పూర్ణ, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) విధార్థ్, సుభాశ్రీ రాయగురు తదితరులు నటించారు.

సాంకేతిక వర్గం:
బ్యానర్ :పి19 స్టూడియోస్
దర్శకుడు : ఆథిత్యా
నిర్మాత: సురేష్ రెడ్డి కొవ్వూరి,
సహా నిర్మాతలు : శ్రీనివాస్ మేదరమెట్ల, జె. కొండలరావు,
మ్యూజిక్ డైరెక్టర్: మిస్కిన్
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : కార్తీక్ ముత్తు కుమార్,
ఎడిటర్ : ఇళయరాజా ఎస్.
ఆర్ట్ డైరెక్టర్:అంటోనీ మరియా కేర్లి,
కో-డైరెక్టర్: ఆర్.బాలచందర్,
పి ఆర్ ఓ : రాంబాబు వర్మ లంకా