Skip to content

సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ

సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ Telugu News

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. “దీవాన” సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమ్మర్ లో “దీవాన” సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
“దీవాన” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా స్టోరీ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న “దీవాన” హర్షిత్ రెడ్డి కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా కానుంది.
నటీనటులు – హర్షిత్ రెడ్డి, తదితరులు
టెక్నికల్ టీమ్
—————-
కాస్ట్యూమ్స్ – మానస
ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల
ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ – ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.