Skip to content

భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025

భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 Telugu News

హైదరాబాద్, నవంబర్ 1, 2025 — హైదరాబాద్‌లోని HICC కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెంట్ క్రియేటర్స్, సినిమా రంగం మరియు మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కొందరు విశిష్ట ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సినిమాటికా ఎక్స్‌పోతో కలిసి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ (DMF) నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం దేశ డిజిటల్ భవిష్యత్తు రూపురేఖలు మార్చబోయే ఎందరో టాలెంటెడ్ క్రియేటర్స్ ను ఒక చోటకు చేర్చింది.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా, తెలంగాణ ప్రభుత్వ I&PR విభాగం ప్రత్యేక కమిషనర్ శ్రీమతి Ch. ప్రియాంక IAS పాల్గొని విజేతలకు అవార్డులను ప్రదానం చేసి అనంతరం ప్రసంగింస్తూ “డిజిటల్ క్రియేటర్స్ అంటే కేవలం వినోదం మాత్రమే అందించేవారు కాదు. వారు విద్యావేత్తలు మరియు ఆలోచింప చేయగల ప్రభావంతులు. అవార్డు గ్రహీతలందరినీ నేను అభినందిస్తున్నాను మరియు మన సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థలో వారి పాత్రను గుర్తించడానికి ఈ జాతీయ కార్యక్రమానికి నాయకత్వం వహించినందుకు భారత్ DMFకి అభినందనలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

భారతదేశంలో అత్యంత ఆరాధించబడిన డిజిటల్ మార్గదర్శకులకు డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 ప్రదానం:
సినిమా బిజినెస్, బాక్సాఫీస్ విశ్లేషణ మరియు ఇండస్ట్రీ ఎక్సక్లూసివ్ న్యూస్ అందిస్తున్నందుకు గాను బాలీవుడ్ ప్రముఖులు తరణ్ ఆదర్శ్ డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ – ఫిల్మ్ జర్నలిజం అవార్డు అందజేశారు. ఆయన మాట్లాడూతూ ” భారత్ DMF నుండి ఈ అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమ డిజిటల్‌గా అభివృద్ధి చెందడాన్ని నేను దగ్గరుండి చూశాను, ఈ మార్పులో భాగం కావడం నాకు గర్వకారణం” అని ప్రసంగించారు.

తెలుగు సినిమా వేదికపై మరియు బుల్లితెరపై ప్రేక్షకులను తన యాంకరింగ్ తో ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న తెలుగు యాంకర్ ‘సుమ కనకాల’కు డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ – ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ “ ఈ అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషకరం. ఈ అవార్డు నాకు ఏంతో స్పెషల్. డిజిటల్ పరంగా మనం ఏంతో అభివృద్ధి చెందవచ్చు, కానీ ప్రేక్షకులతో సంబంధం స్థిరంగా ఉంటుంది,” అని వ్యాఖ్యానించారు.

డిజిటల్ యుగంలో సెలబ్రిటీ ఫోటో జర్నలిజాన్ని పునర్నిర్వచించినందుకు భారతదేశపు ప్రముఖ బాలీవుడ్ పాపరాజో మానవ్ మంగ్లానీ డిజిటల్ ఐకాన్ – విజువల్ ఇన్‌ఫ్లుయెన్స్ అవార్డును అందుకున్నారు. ఆ సంతోషాన్ని పంచుకుంటూ “ఇది నాకు మాత్రమే కాదు, డిజిటల్ పాపరాజ్జీ కమ్యూనిటీకి దక్కిన గౌరవం. మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రేక్షకులకు అనుగుణంగా కంటెంట్ రూపొందిస్తూనే ఉన్నాము” అని మానవ్ పేర్కొన్నారు.

రా టాక్స్ వంశీ కూరపాటి.. పాడ్‌కాస్టింగ్ లో సంచలనం సృష్టించి ఎందరో ప్రముఖుల ఇన్నర్ వాయిస్ ను ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు గాను ‘డిజిటల్ ఐకాన్ – పాడ్‌కాస్టింగ్ & యూత్ వాయిస్ అవార్డు’ వంశీ కూరపాటి అందుకున్నారు. “ఈ అవార్డు తమ స్థానిక భాషను మరియు ఎమోషన్స్ ను ప్రజలతో కనెక్ట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతి క్రియేటర్ కు చెందుతుంది. వచ్చేది అంతా డిజిటల్ యుగం” అని భావోద్వేగంతో అన్నారు.

ఈ కార్యక్రమానికి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపకుడు విశ్వ సీఎం నాయకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ ‘
“ఇది ప్రారంభం మాత్రమే. భారత్ DMF ముఖ్య ఉద్దేశం అన్ని రాష్ట్రాలు, భాషలు మరియు ప్లాట్‌ఫారమ్‌లలో భారతదేశ డిజిటల్ సృష్టికర్తలను ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకురావడం. అవార్డుల నుండి సృష్టికర్త సంక్షేమం వరకు భారతదేశపు మొట్టమొదటి creator zone ను స్టార్ట్ చేయడం కోసం మేము nation-first creator ecosystem ను బిల్డ్ చేస్తున్నాం.

ప్రముఖ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా సంస్థలు మరియు టెక్ భాగస్వాములు హాజరైన ఈ వేడుక, భారత్ DMF జాతీయ అధ్యాయాలకు సంబంధించిన రోడ్ మ్యాప్, ప్రపంచ వేదికలతో సహకారం మరియు నెక్ట్స్ జనరేషన్ క్రియేటర్స్ కోసం సంక్షేమం మరియు శిక్షణ కార్యక్రమాలతో ముగిసింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.