సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'కరుప్పు' కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు…
జీ5లో ‘హే బల్‌వంత్’కు 50 మిలియన్ స్ట్రీమింగ్

సుహాస్ హీరోగా త్రిశూల్ విజనరీ స్టూడియో బ్యానర్ మీద బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బల్‌వంత్’. గోపి అచ్చర తెరకెక్కించిన ఈ చిత్రంలో శివాని నగరం, నరేష్ విజయ కృష్ణ, సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకి థియేటర్లో మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గానే ఈ మూవీని జీ5లో స్ట్రీమింగ్ చేశారు. స్ట్రీమింగ్ చేసిన కొద్ది రోజులకే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ని సొంతం చేసుకుంది.
టీజర్, ట్రైలర్‌తోనే చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టే సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఉండే ఆ బిజినెస్ ఏంటి? అసలు ఆ వ్యాపారం ఏంటి? అనే ఆసక్తిని పెంచేసి.. థియేటర్ వరకు జనాల్ని రప్పించారు. సినిమాకు థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ఓటీటీలోనూ అంతే స్థాయిలో ఆదరణ దక్కింది. ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ చేసిన కామెడీ మేజర్ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందించగా.. మహి రెడ్డి కెమెరామెన్‌గా పని చేశారు. ఈ మూవీకి విప్లవ్ నైషధం ఎడిటర్‌గా వర్క్ చేశారు.
Watch NOW on ZEE5: https://zee5.onelink.me/RlQq/sbifs8xg
