#SVC63 చుట్టూ హైప్ రోజురోజుకీ పెరుగుతోంది, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత బిగ్ స్కేల్ కి…
ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల


పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాల గమనం’. సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఇప్పటికే నిర్మాత ఏఎమ్ రత్నం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదలవుతుందని చెబుతూ చిత్రయూనిట్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శక,నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ.. ‘‘లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం గారు మా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ పోస్టర్ చాలా మంచి స్పందనను రాబట్టుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. యూత్ మెచ్చే ఓ మంచి ప్రేమకథ ఇది. అదేవిధంగా పెద్దలను పిల్లలను ఆలోచింప చేసే సందేశాత్మక చిత్రమిది.అతి త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నాము. ఇకపై వరుసగా ప్రమోషనల్ కంటెంట్ వదులుతూ, కార్యక్రమాలు చేయనున్నాం. ఈ జర్నీలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్మకంగా చెప్పగలం’’ అని తెలిపారు.
రాజా బిరుదుల, లావణ్యరామారావు, చిన్న బాబు కల్లా, డాక్టర్ జబర్దస్త్ రాజమౌళి, అన్నె శిరీష, సతీష్ సరిపల్లి, ఆర్కే నాయుడు, బలగం రమేష్, బలగం కర్తానందం, జబర్దస్త్ శాంతి కుమార్, శివ ప్రసాద్, తిరు నాచురల్ , చిన్నారావు దొడ్ల, సీతారాం తదితరులు నటించిన ఈ చిత్రానికి
మ్యూజిక్- రాజేష్ రాజ్ తేలు,
డి ఓ పి- మురళి కంకణాల,
ఎడిటర్- శ్రీకృష్ణ ప్రసాద్,
అసిస్టెంట్ డైరెక్టర్- శ్రీనివాస్ కారేటి
కాస్ట్యూమ్ డిజైనింగ్- శ్వేతా బొమ్మారెడ్డి
పీఆర్‌ఓ – బి. వీరబాబు,
నిర్వహణ- పిల్లెం రామారావు , శ్రీకర్ బుర్రి
రైటర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్- సుధాకర్ బుర్రి.
