నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్…
రమేష్ వర్మ ప్రోత్సాహంతో “కొక్కొరోకో” అంటున్న మనస్విని బాలబొమ్మల


ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం “కొక్కొరోకో” షూటింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. నీలాద్రి ప్రొడక్షన్ సమర్పణలో, RV ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు.
సంప్రదాయ కోడిపందాల నేపథ్యం చుట్టూ తిరిగే కథతో, ఐదు విభిన్న పాత్రలతో రూపొందిన అంథాలజీ చిత్రంగా “కొక్కొరోకో” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లేను రమేష్ వర్మ అందించగా, బలమైన విజువల్స్‌తో పాటు భావోద్వేగాత్మక కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 2026లో విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో మరో ముఖ్య విశేషం ఏమిటంటే…
“మనస్విని బాలబొమ్మల” అనే ప్రతిభావంతమైన కళాకారిణి ఈ చిత్రంతో సినీ అరంగేట్రం చేయడం. “కొక్కొరోకో”లో ఆమె గెస్ట్ రోల్లో కనిపించనుంది. మనస్విని థియేటర్లో శిక్షణ పొందిన నటి. Little Women నాటకంలో Jo, Much Ado About Nothingలో Beatrice వంటి ప్రధాన పాత్రలు పోషించింది. అంతేకాదు, ఆమె సంప్రదాయ పేర్ని నాట్యం, కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం కలిగి ఉంది. Glendale Academyలో భక్తిగీత ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పలు ముఖ్యమైన స్కూల్ ఈవెంట్స్‌కు యాంకర్‌గా కూడా వ్యవహరించింది.
చిత్రబృందం తెలిపిన ప్రకారం, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, ఫ్రెష్ కథనాలతో, విజువల్‌గా మరియు భావోద్వేగాత్మకంగా ప్రత్యేకమైన అనుభూతిని అందించడమే “కొక్కొరోకో” లక్ష్యం.
సాంకేతిక వివరాలు:
నిర్మాతలు: రేఖా వర్మ, కూరపాటి శిరీష
దర్శకత్వం: శ్రీనివాస్ వసంతాల (డెబ్యూ)
కథ – స్క్రీన్ ప్లే: రమేష్ వర్మ
సంగీతం: సంకీర్తన్
ఛాయాగ్రహణం: ఆకాశ్ ఆర్. జోషి
మాటలు: జీవీ సాగర్
