-“లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను: నిర్మాత…
“కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్


యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ “కొత్త కొత్తగా”. ఈ సాంగ్ లో “దేవగుడి” మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో
నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ – శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము నిర్మించిన సీరియల్స్ లో నటించింది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆమెలో కనిపించేది. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లో తనే నటించి నిర్మించి, దర్శకత్వం వహించింది. ఈ సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్ లా రిచ్ గా రూపొందించింది శ్రీజ. ఆమెతో పాటు అభినవ్ శౌర్యకు కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
నటి పొట్టి విజయ మాట్లాడుతూ – శ్రీజ అందమైన హీరోయిన్ మాత్రమే కాదు అందమైన వ్యక్తిత్వం గల అమ్మాయి. ఆమె తనతో నటించే తోటి ఆర్టిస్టులను ఎంతో ఆదరంగా చూసుకుంటుంది. కొత్త కొత్తగా సాంగ్ చాలా బాగుంది. ఆమె ఇప్పుడు నిర్మాత, దర్శకురాలు అయ్యింది కనుక మాలాంటి వారికి అవకాశాలు ఇస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
నటి మేఘన చౌదరి మాట్లాడుతూ – శ్రీజ నాకు మంచి ఫ్రెండ్. ఆమె శ్రీజ మ్యూజిక్ అని ఛానెల్ పెట్టి మంచి సాంగ్స్ చేస్తోంది. తను నిర్మాతగా, డైరెక్టర్ గా మారడం గర్వంగా ఉంది. కొత్త కొత్తగా సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్ చూసిన ఫీల్ కలుగుతోంది. ఆమె ఇలాంటి మరిన్ని సాంగ్స్ చేయాలి. అన్నారు.
నటి సంధ్య మాట్లాడుతూ – కొత్త కొత్తగా సాంగ్ ఎంత బాగుందో, ఈ పాటలో శ్రీజ, అభినవ్ శౌర్య పర్ ఫార్మెన్స్ లు కూడా అంతే బాగున్నాయి. వీళ్లిద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సాంగ్ ను మ్యూజిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
నటుడు ఫణి మాట్లాడుతూ – శ్రీజ ఈ పాటలో సాఫ్ట్ గా కనిపిస్తుంది గానీ ఆమె చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది. మాతో జబర్దస్త్ షో చేసేప్పుడు శ్రీజ ఎంత ఎనర్జిటిక్ గా, అగ్రెసివ్ గా ఉంటుందో అర్థమైంది. జెమినీ టీవీలోనూ నాతో ఒక ప్రోగ్రాం చేసింది. మంచి స్థాయికి ఎదగాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటుంది. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ తోనూ మనల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. శ్రీజ చేసిన ఈ సాంగ్ ఆల్బమ్ ఆమెకు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ – దేవగుడి చిత్రంతో నాకు హీరోగా జన్మనిచ్చారు బెల్లం రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ కూడా ఆయన సపోర్ట్ తోనే చేయగలిగాను. శ్రీజతో కలిసి ఈ సాంగ్ చేయడం హ్యాపీగా ఉంది. ఆమెకు పట్టుదల ఎక్కువ. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా చాలా క్లారిటీగా ఉంటుంది. తను అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు ప్రయత్నిస్తుంది. ఈ పాటకు స్టెప్స్ నేనే కొరియోగ్రాఫ్ చేశాను. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. హీరోగా స్క్రిప్ట్స్ వింటున్నా. మంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ చేయాలనుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీజ మాట్లాడుతూ – మా కొత్త కొత్తగా సాంగ్ ను లాంఛ్ చేసిన ప్రొడ్యూసర్ డీవై చౌదరి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వారి ప్రొడక్షన్ లో నేను సీరియల్స్ లో నటించాను. నాకు నటన అంటే ప్యాషన్. రంగస్థలం సినిమాలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత మరికొన్ని మూవీస్ లోనూ నటించాను. టీవీ ఛానెల్స్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, జూ లకటక షోస్ చేశాను. శ్రీజ మ్యూజిక్ ఛానెల్ లో మేము చేసిన సాంగ్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ చేశాం. ఈ పాటను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశాం. బడ్జెట్ ఎంతయ్యింది అనేది చూసుకోలేదు. ఈ సాంగ్ లో కొంత షూట్ మా ఇంట్లోనే చేశాం. కొత్త కొత్తగా సాంగ్ ను మీరంతా విని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
బీఆర్ఎస్ మహిళా వింగ్ మణికొండ ప్రెసిడెంట్ పటోళ్ల రూప రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త కొత్తగా ఆల్బమ్ మంచి విజయం సాధించాలని తన బెస్ట్ విశెస్ అందించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీజ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
