Skip to content

అనిల్ రావిపూడి ప్రశంసించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’

-“లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను: నిర్మాత దిల్ రాజు
-లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అందరూ రిలేట్ అయ్యే సినిమా. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ చాలా కొత్త కథ ఎక్స్ పీరియన్స్ చేస్తారు: హీరో ప్రదీప్ రంగనాథన్
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా దిల్ రాజు గారు ఇచ్చిన ఆఫర్ నాకు చాలా నచ్చింది. అయితే ప్రదీప్ హీరోగా ఆయన నిర్మాణంలో సినిమా చేస్తే నేను కచ్చితంగా చేస్తాను. ప్రస్తుతం అలాంటి ప్లాన్స్ లేవు, హ్యాపీగా డైరెక్షన్ చేసుకుంటున్నాం (నవ్వుతూ). ఈ సినిమా ప్రొడ్యూసర్ నయనతార గారు. మేము రీసెంట్ “శంకర్ వరప్రసాద్” సినిమా కోసం వర్క్ చేశాం. ఆమె చాలా హంబుల్ పర్సన్. విగ్నేష్ గారు నయన్ గారు చూపించిన ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేను.ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. విగ్నేష్ గారు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ నాకు ప్రత్యేకంగా చూపించారు. డబ్బింగ్ గురించి మర్చిపోయి సినిమా ఎంజాయ్ చేశాను. సినిమా చాలా న్యూ ఏజ్ కంటెంట్‌తో ఉంది. 2040లో మనం టెక్నాలజీ మీద ఎంత డిపెండ్ అవుతామో చాలా ఇన్నోవేటివ్‌గా చూపించారు. ప్రదీప్ అద్భుతంగా నటించాడు. ఎస్.జె. సూర్య గారు మరో హైలైట్. ట్రైలర్‌లో చూపింది చాలా తక్కువే. థియేటర్స్‌లో సినిమా మామూలుగా వుండదు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. కృతి ఈ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా నటించింది. ప్రదీప్ అందరికీ నచ్చే హీరో. ఎందుకంటే అతను మనలో ఒకడిలా అనిపిస్తాడు. అతని నటన చాలా రియల్‌గా ఉంటుంది. అందుకే అతనికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తున్నాయి. ఈ సినిమా కూడా అతని కెరీర్‌లో మరో పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రదీప్ “లవ్ టుడే” సినిమా చూసినప్పుడే ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని అనిపించింది. అందుకే తెలుగులో రిలీజ్ చేశాం. ఆ సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రదీప్ హీరోగా, డైరెక్టర్‌గా వరుస విజయాలు సాధిస్తున్నాడు. విగ్నేష్ శివ ఎప్పుడూ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తారు. “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ రోజుల్లో ప్రేమ కథ తీయడం చాలా కష్టం. అలాంటి సమయంలో అందరికీ రిలేట్ అయ్యేలా, ఒక అప్లికేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ తీసారు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అవుతోంది. ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మా అనిల్ కూడా హీరోలా ఉంటాడు. ప్రదీప్ లా తను కూడా యాక్టింగ్ చేస్తే సరైన కథతో, సరైన టైమ్‌లో నేను అతన్ని హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నాను (నవ్వుతూ).
హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం—అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా? ఇద్దరి మధ్య జరిగేదాన్ని వాళ్లిద్దరికే తెలుసు, కానీ చాట్ జీపీటీకి తెలియదు. ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మిషన్ ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది.అలాంటి పరిస్థితిలో..ఒక అప్లికేషన్ మనకి సరైన పార్ట్నర్ ఎవరో చెబితే? దానిపై ప్రేమను నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ సినిమాలో చూపించిన విషయాలు చాలా రిలేటబుల్‌గా ఉంటాయి. అదే సమయంలో కమర్షియల్‌గా కూడా చెప్పాం లవ్, కామెడీ, సాంగ్స్ అన్నీ ఉంటాయి. అనిరుద్ గారితో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. విగ్నేష్ గారు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. కృతి ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈవెంట్‌కు వచ్చిన దిల్ రాజు గారు, అనిల్ గారికి థాంక్స్. తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ మాటల్లో చెప్పలేను. టీజర్‌లో నా సొంత వాయిస్ ఉంది. పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను స్వయంగా డబ్బింగ్ చెప్తాను. ఏప్రిల్ 10న థియేటర్స్‌లో కలుద్దాం!
ఎస్.జె. సూర్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అవుతోంది.అనిల్ గారు థాంక్స్. ఆయన ఈ సినిమా చూశారు. చాలా మంచి మాటలు చెప్పారు. అనిల్ గారు సినిమా చూసి చెప్పిన మాటలు మా నమ్మకాన్ని మరింత పెంచాయి. ఈ సినిమా చాలా ఫ్యూచరిస్టిక్‌గా ప్లాన్ చేశారు. ట్రైలర్ మీకు నచ్చింది కదా.. సినిమా ఇంకా బాగుంటుంది. జాలీగా ఎంజాయ్ చేయండి. ప్రదీప్ అద్భుతమైన నటన చేశాడు. ఇది మంచి లవ్ స్టోరీ. కృతి చాలా బాగా నటించింది. అనిరుద్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ. డైరెక్టర్ విగ్నేష్ గారు చాలా నిజాయితీగా పని చేశారు. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్. ప్రేక్షకులు ఆయన కష్టానికి ఫలితం ఇస్తారని నమ్ముతున్నాను.
హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ అందరికీ నమస్కారం. హైదరాబాద్‌కి ఎప్పుడొచ్చినా ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది. ఈ సినిమా తీయడం ఈజీ కాదు. చాలా ఎఫర్ట్ పెట్టాం. విగ్నేష్ గారు ప్రతి డీటెయిల్‌ను చాలా బ్యూటిఫుల్‌గా తెరకెక్కించారు. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీ చేస్తున్నాను. ఈ పాత్ర కోసం ఎంతోకాలం ఎదురు చూశాను. ఫైనల్‌గా అద్భుతమైన పాత్ర ఇచ్చారు. “బేబమ్మ” తర్వాత ప్రేక్షకులు ఈ పాత్రను “ధీమా” అని పిలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రదీప్‌తో పని చేయడం మంచి అనుభవం. అనిరుద్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
డైరెక్టర్ విగ్నేష్ శివ మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. ముందుగా ప్రదీప్‌కి థాంక్స్ చెప్పాలి. ఈ స్క్రిప్ట్‌ను నమ్మి చేశాడు. అతనికి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. కృతి చాలా బాగా నటించింది. అనిరుద్ నా మంచి ఫ్రెండ్, ఆయన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. కానీ అందరికీ అర్థమయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అనిల్ గారికి సినిమా చూపించాక ఆయన చెప్పిన మాటలు నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఇది ఫ్యూచరిస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా. కొత్త కథను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను.
డిస్ట్రిబ్యూటర్ శివప్రసాద్ మాట్లాడుతూ.. విగ్నేష్ గారు ప్రదీప్ గారు ఆడియన్స్ పల్స్ తెలిసిన మేకర్స్. అనిల్ గారు ఈ వేడుకకి రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది.
నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, ఎస్ జె సూర్య, కృతి శెట్టి, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రహ్, మాళవిక
రచన & దర్శకత్వం: విఘ్నేష్ శివన్
నిర్మాత – నయనతార
నిర్మాత & సమర్పణ – SS లలిత్ కుమార్
సహ నిర్మాత – L.K. విష్ణు కుమార్
తెలుగు రిలీజ్: శ్రీ పద్మిని సినిమాస్
సంగీతం – అనిరుధ్ రవిచందర్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – రవి వర్మన్ ASC ISC
ప్రొడక్షన్ డిజైన్ – టి ముత్తురాజ్
ఎడిటర్ – ప్రదీప్ ఇ రాఘవ
పీఅర్వో: వంశీ శేఖర్