Skip to content

ఏప్రిల్ 5న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం

ఏప్రిల్ 5న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం Telugu News
ఏప్రిల్ 5న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం Telugu News

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి రోకా వేడుక గత నెలలో అంగరంగ వైభవవంగా జరిగింది. సంప్రదాయం, వేడుక, కుటుంబ ఆత్మీయతల కలయికతో జరిగిన ఈ వేడుక, వారి వివాహ ప్రయాణానికి ఒక పరిపూర్ణమైన ఆరంభాన్ని ఇచ్చింది.
వివాహానికి ముందు జరిగే వేడుకలు అధికారికంగా ప్రారంభం కాగా, నిశ్చితార్థం ఏప్రిల్ 5న జరగనుంది. విశాలమైన ఫామ్‌హౌస్‌లో జరగనున్న ఈ కార్యక్రమం వైభవం, ఆత్మీయతల కలయికగా ఉంటుంది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.
వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న, దివ్యమైన తిరుమల ప్రాంగణంలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చిరస్మరణీయమైన కలయికకు సరైన వేదికగా నిలుస్తుంది.