మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'…
ఆకట్టుకుంటున్న హీరోయిన్ నభా నటేష్ లుక్స్

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. నాలుగేళ్ల క్రితం ఆమె భుజానికి గాయమైంది. ఆ గాయాల మచ్చలను దాచుకోకుండా కొత్త స్టిల్స్ లో నభా నటేష్ కనిపించడం విశేషం. 2022లో నభాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఎడమ భుజానికి గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత తన కాన్పిడెంట్ కోల్పోకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న నభా నటేష్ మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ సమ్మర్ ఆమెకు ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధం ఈ వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కిన ఈ రెండు చిత్రాల్లో నభా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. నాగబంధం చిత్రంలో పార్వతి క్యారెక్టర్ లో, స్వయంభు చిత్రంలో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో ఆమె సాలిడ్ లైనప్ చేసుకుందని చెప్పుకోవచ్చు. స్వయంభు, నాగబంధం చిత్రాల్లోని కంటెంట్ ఆడియెన్స్ కు రీచ్ అయితే నభా నటేష్ హీరోయిన్ గా మరో స్థాయికి వెళ్లడం ఖాయమని అనుకోవచ్చు.





