Skip to content

‘నాగబంధం’ నుంచి అబ్దాలిగా రిషబ్ సాహ్నీ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

  • MOVIES
  • Vishwanath
‘నాగబంధం’ నుంచి అబ్దాలిగా రిషబ్ సాహ్నీ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’ ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల15న మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. దీనికి ముందు, ఈ ఇతిహాస కథనంలోని మరో కీలక పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు

బాలీవుడ్ ‘ఫైటర్’లో తన అద్భుతమైన ప్రజెన్స్ తో ఆకట్టుకున్న రిషబ్ సాహ్నీ నాగబంధంలో ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి పాత్రను పోషించాడు. 1750లో బ్యాక్ డ్రాప్ లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను చూపించబోతున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ పవర్ ఫుల్ గా వుంది. మంచుతో కప్పబడిన యుద్ధభూమిలో తుఫాన్ వాతావరణం మధ్య, భారీ రక్తంతో మచ్చలపడ్డ గొడ్డలిని చేతబట్టి యుద్ధానికి దూసుకెళ్తున్న అబ్దాలీగా రిషభ్ కనిపిస్తారు. అతని వెనుక భారీ సైన్యం, గాలికి చీలిపోతున్న ఆకుపచ్చ యుద్ధ జెండాలు, విలువిద్యకులు, యోధులు, యుద్ధ ఏనుగులు మొత్తంగా ఒక హై-వోల్టేజ్ వార్ కాన్వాస్‌ను సృష్టించాయి. చుట్టూ మెరుస్తున్న కళ్లతో ఉన్న తోడేళ్ల గుంపు అతని చుట్టూ చేరడం పాత్రలోని క్రూరత్వాన్ని మరింత పెంచుతోంది.

‘నాగబంధం’లో అబ్దాలీని ఆశ, క్రూరత్వంతో నడిచే వ్యక్తిగా కనిపించనున్నారు. హిమాలయాల్లో దాగి ఉన్న మిథికల్ నాగబంధాన్ని స్వాధీనం చేసుకోవడానికి, బ్రాహ్మణులు, పిల్లలు సహా ఎందరి ప్రాణాలనైనా బలి చేయడానికి వెనుకాడని వ్యక్తిగా ఈ పాత్ర ఉండబోతోంది. చరిత్రలో అతడు అత్యంత నిర్దయుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కావడం విశేషం.

రిషభ్ నటనపై దర్శకుడు అభిషేక్ నామా ప్రశంసలు కురిపించారు. “రిషభ్ చేసిన నటన చూస్తే, అబ్దాలీనే తెరపై జీవించినట్టుగా అనిపిస్తుంది. ఈ క్లిష్టమైన పాత్రలో అతడు అద్భుతంగా నటించారు”

“అబ్దాలీ లాంటి సవాలుతో కూడిన పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆ పాత్ర, అతని లక్ష్యాలను కథకు న్యాయం చేస్తూ చూపించేందుకు ప్రయత్నించాను” అని రిషభ్ అన్నారు

నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, ఆర్‌సి ప్రణవ్ ఎడిటింగ్, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ‘నాగబంధం’ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకుంది.

నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్

సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే, జునైద్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
సీఈఓ: వాసు పోతిని
పీఆర్ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాస్టాగ్ మీడియా

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.