'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా 'గబ్బర్ సింగ్' స్థాయి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను: పవర్ స్టార్…
‘నాగబంధం’ నుంచి “నమో రే” సాంగ్ రిలీజ్


పాన్-ఇండియా మాగ్నమ్ ఓపస్ ‘నాగబంధం’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన “నమో రే” పాట విడుదలైంది. దర్శకుడు అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపరెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, కళాత్మక సంపదను ప్రతిబింబించేలా రూపొందుతోంది.
తాజాగా విడుదలైన “నమో రే” పాట భక్తి యుగానికి శ్రీకారం చుట్టింది. శ్రీమహా విష్ణువుకు అంకితంగా రూపొందిన ఈ పాట భక్తి, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతిని అద్భుతంగా చూపించింది.
ఈ సాంగ్‌కు జునైద్ కుమార్, అభే అద్భుతమైన మ్యూజిక్ అందించారు. క్లాసికల్ టచ్‌తో పాటు మోడరన్ మ్యూజిక్ స్టైల్‌ను కలిపి గొప్ప అనుభూతిని ఇచ్చారు. శ్రీహర్ష ఈమని లిరిక్స్ లో భక్తి భావం అద్భుతంగా వినిపిస్తుంది. గాయకులు సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారూరి పాడిన విధానం పాటకు మరింత బలాన్ని ఇచ్చింది.
ఈ సాంగ్‌లో మరో పెద్ద ఆకర్షణ మ్యాసీవ్ కొరియోగ్రఫీ. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేశ్ ఆచార్య, శ్రష్టి వర్మ నేతృత్వంలో దాదాపు రెండు వేల మందికి పైగా డ్యాన్సర్లు వివిధ భారతీయ నృత్యాలతో అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారు. హీరోయిన్లు నభా నటేశ్, దక్ష నాగార్కర్ క్లాసికల్ డ్యాన్స్‌తో సాంగ్‌ను మరింత గ్రాండ్‌గా మార్చారు.
ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అచ్చంగా గుర్తుకు వచ్చేలా ఒక అద్భుతమైన సెట్ రూపొందించారు. తిరువనంతపురంలోని అసలు ఆలయంలోనే షూట్ చేసినట్టుగా అనిపించేంత ఖచ్చితంగా ఈ సెట్‌ను తయారు చేశారు. ఆలయంలో కనిపించే పవిత్ర మార్గాలు, అందమైన శిల్పాలు అన్నీ ఎంతో జాగ్రత్తగా సెట్‌లో చూపించారు. ప్రతి చిన్న డీటైల్ కూడా పరిశోధన చేసి రూపొందించినట్టుగా కనిపిస్తుంది. ఈ సెట్ గ్రాండియర్‌తో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా తీసుకొచ్చింది. స్క్రీన్‌పై చూసిన వెంటనే ప్రేక్షకులు నిజమైన ఆలయంలోకి వెళ్లినట్టుగా అనిపించే ఫీల్ ఇస్తుంది. సినిమాలో ఇది అత్యంత ప్రత్యేకంగా నిలిచే క్రియేటివ్ హైలైట్‌లలో ఒకటిగా నిలవనుంది.
సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ తన కెమెరాతో ఈ సెట్ గ్రాండియర్‌ను మరింత అందంగా చూపించారు. కలర్స్, లైటింగ్, ఫ్రేమ్స్ అన్ని కలిసి ఈ సాంగ్‌ను నెక్స్ట్ లెవల్ లో ప్రజెంట్ చేశాయి.
“నమో రే” సాంగ్ కేవలం ఒక పాట మాత్రమే కాదు. భక్తి, ఐక్యత భావాలను చెప్పే ఒక ప్రత్యేక అనుభూతిలా వుంది. లిరిక్స్, మ్యూజిక్, మ్యాసీవ్ కొరియోగ్రఫీ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తున్నాయి. ఈ పాట యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అవుతోంది.
నాగబంధం సినిమాపై ఇప్పటికే హ్యుజ్ బజ్ నెలకొంది.“నమో రే” సాంగ్ చూసిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగాయి. ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు భక్తి, భావోద్వేగాలను కూడా ప్రేక్షకులకు అందించేలా సినిమా అద్భుతంగా రూపొందుతోంది.
నాగబంధం సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, రిషబ్ సాహ్ని, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్,
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: NIK స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగి రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: జునైద్ కుమార్ – అభే
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జునైద్ కుమార్
CEO: వాసు పోతిని
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
VFX డైరెక్టర్: అభిషేక్ నామా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
కాస్ట్యూమ్ డిజైనర్లు: రాజేష్ కమర్సు, చలమక్లా విభా రెడ్డి, శశి చౌదరి
యాక్షన్: కనల్ కన్నన్, వ్లాడ్ రిమ్‌బర్గ్ (USA), రియల్ సతీష్, కేచా ఖంఫక్డీ, నందు, రన్ నవరాచ్ (థాయ్‌లాండ్), జూనియర్ వెంకట్.
కొరియోగ్రఫీ: బృందా, గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీహర్ష ఈమని
స్క్రిప్ట్ డెవలప్‌మెంట్: రాజీవ్ ఎన్ కృష్ణ
DI: రెడ్ చిల్లీస్
కలరిస్ట్: కెన్ మెర్జ్కర్
DTS & Atmos: M.R. రాజాకృష్ణన్
VFX క్రియేటివ్ డైరెక్టర్: అభిషేక్ నామా
చీఫ్ కో-డైరెక్టర్: లలిత్ ప్రభాకర్ నాగ్ సూర్యదేవర
కో-డైరెక్టర్: వెంకర్ రెడ్డి కుంచం
అసోసియేట్ డైరెక్టర్లు: రమేష్ రావూరి, పెదబలి నిఖిలేశ్వర్ రెడ్డి
సహాయ దర్శకులు: రూప్‌కుమార్ మగాపు, ఎ. సుధీర్ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్: రాఘవ, గణేశుని వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు: దూలం రమేష్, ఎండీ జాఫరుద్దీన్
ప్రొడక్షన్ మేనేజర్స్: బోయపాటి సతీష్, ఆనం నవీన్
పబ్లిసిటీ డిజైన్స్: కాని స్టూడియోస్
స్టిల్స్: స్నాపిన్ ఫోటోగ్రఫీ శివ
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
PRO: వంశీ-శేఖర్
