-“లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను: నిర్మాత…
డా. నాగేశ్వరరావు పూజారి బర్త్ డే సందర్భంగా మూవీ అనౌన్స్ మెంట్

ప్రముఖ అడ్వకేట్ , రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన డా.నాగేశ్వరరావు పూజారి తన “సైన్మా స్టూడియోస్” బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 1 చిత్రాన్ని ఈ రోజు అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ దర్శక నిర్మాత వేణు ఊడుగుల సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు పీవీఎన్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నిర్మాత డా.నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి కంటిని, ఆ కంటిలో అన్నా తమ్ముడు సైకిల్ పై వెళ్తుండటం చూపించారు. ఈ ప్రకృతి మనకు ఇచ్చిన స్నేహితుడు మన సోదరుడు, కానీ ఆ బంధానికి మధ్యలో అహం అనే అడ్డుగోడలు మనమే నిర్మించుకున్నాం. అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.
టెక్నికల్ టీమ్
———————
బ్యానర్ – సైన్మా స్టూడియోస్
సమర్పణ – వేణు ఊడుగుల
నిర్మాత – డా.నాగేశ్వరరావు పూజారి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మార్కెటింగ్ : హౌస్ ఫుల్
రచన, దర్శకత్వం – పీవీఎన్ కార్తికేయ
