Skip to content

“ఒక్క చాన్స్ ప్లీజ్ ” అంటున్న పల్లవి గౌడ్

“ఒక్క చాన్స్ ప్లీజ్ ” అంటున్న పల్లవి గౌడ్ Telugu News

“చిన్నప్పుడు ఒకసారి వినాయక చవితి ఉత్సవం సందర్భంగా స్టేజి ఎక్కి డాన్స్ చేశాను. అప్పుడు వినిపించిన ఈలలు చప్పట్లు ఇప్పటికీ నాకు గుర్తు. ఆ క్షణమే… ఎప్పటికైనా వెండి తెరపై నన్ను నేను చూసుకోవాలని ఆశపడ్డాను. ఒకసారి వచ్చిన ఒక మంచి ఛాన్స్ చేజేతులారా జారవిడుచుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నాను” అంటుంది పల్లవి గౌడ్.

కుటుంబ బాధ్యతల కారణంగా తనలోని కళాతృష్ణను ఇన్నాళ్లు తనలోనే అణచివేసుకున్న ఈ “అచ్చ తెలుగు తెలంగాణ ఆడపడుచు” ఇప్పుడిప్పుడు రీల్స్, ఫోక్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రతిభను చాటుకుంటూ సినిమా రంగం వైపు స్థిరంగా అడుగులు వేస్తోంది. ప్రముఖ దర్శకుడు కర్రి బాలాజీ రిఫరెన్స్ తో త్వరలో విడుదల కానున్న “హుషారు పిట్ట” చిత్రంతో పెద్దతరపై బుల్లి అడుగు వేసిన పల్లవి… ఈ రంగంలో తనకంటూ “చిన్న గుర్తింపు” తెచ్చుకోవాలని ఆశపడుతోంది. పల్లవిని ప్రోత్సహించాలనుకునేవారు 9160513151 నంబర్లో సంప్రదించవచ్చు!!