Skip to content

ఫంకీ’ టీజర్ విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఫంకీ'. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. అనుదీప్ దర్శకత్వంలో వినోదం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపేలా 'ఫంకీ' టీజర్ ఎంతో హాస్యభరితంగా, ఓ విందు భోజనంలా ఉంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇందులో విశ్వక్ సరికొత్తగా కనిపిస్తున్నారు. కథానాయిక కయాదు లోహర్‌ తన అందంతో కట్టిపడేశారు. వీరి జోడి కొత్తగా, ఉత్సాహంగా కనిపిస్తూ.. తెరకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. టీజర్ లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనదైన నేపథ్య…

Read more

డ్యూడ్‌ లో ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ చాలా కొత్తగా వుంటాయి : శరత్ కుమార్

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శరత్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. డ్యూడ్…

Read more

‘మిత్ర మండలి’ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు – నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప

ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. వారు చెప్పిన విషయాలు, విశేషాలు. ‘మిత్ర మండలి’ కథ మీ వద్దకు ఎలా వచ్చింది? ఈ జర్నీ ఎలా ప్రారంభమైంది. బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. గీతా ఆర్ట్స్‌లో మేం చాలా కాలం ఆయనతో పాటుగా పని చేశాం. ‘కోటబొమ్మాళీ పీఎస్’, ‘ఆయ్’, ‘తండేల్’, ‘సింగిల్’ ఇలా చాలా చిత్రాల్ని చేశాం…

Read more

నా 50 ఏళ్ల నట జీవితంలో ‘అరి’ వంటి సినిమాలో నటించడం గర్వంగా ఉంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైలాగ్ కింగ్ సాయికుమార్

ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

Read more

తెలుసు కదా’ చాలా కొత్త రొమాంటిక్ డ్రామా. : శ్రీనిధి శెట్టి

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఫస్ట్…

Read more

విజయశాంతి చేతుల మీదుగా “దక్కన్ సర్కార్” పోస్టర్ విడుదల

తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ రచయిత కళా శ్రీనివాస్ గారు ప్రతిష్టత్మాకంగా నిర్మించిన "దక్కన్ సర్కార్" సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం బంజారాహిల్స్ రోడ్ no 12 లో జరిగింది..లేడి సూపర్ స్టార్, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ శ్రీమతి విజయశాంతి గారు ఈ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మరో సీనియర్ ఉద్యమకారుడు, కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే, చిత్ర హీరో చాణక్య, మరో లీడ్ యాక్ట్రెస్ మౌనిక పాల్గొన్నారు.. విజయశాంతి గారు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత, ప్రజాకళాకారుడు కళా శ్రీనివాస్ నిర్మిస్తున్న దక్కన్ సర్కార్ సినిమా ప్రజల్లోకి వెళ్లాలని, చిత్ర విజయానికి తన వంతు కృషి చేస్తానని సినిమా…

Read more

‘ప్రేమంటే’ నుంచి దోచావే నన్నే సాంగ్

స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమా చేస్తున్న ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్‌. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP)ప్రతిష్టాత్మక బ్యానర్‌ నిర్మిస్తోంది. స్పిరిట్ మీడియా సమర్పిస్తుంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ 'దోచావే నన్నే'ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు…

Read more

‘మిత్ర మండలి’ నవ్విస్తుంది – నిహారిక ఎన్ ఎం

ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం జంటగా విజయేందర్ దర్శకుడిగా బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో హీరోయిన్ నిహారిక ఎన్ ఎం మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే.. ‘మిత్ర మండలి’ కథను ముందుగా విన్నారా? ‘పెరుసు’ కథని ముందుగా విన్నారా? మీ మొదటి చిత్రం ఏది? నేను ముందుగా ఈ ‘మిత్ర మండలి’ కథనే విన్నాను. కానీ ‘పెరుసు’ తమిళ చిత్రం ముందుగా రిలీజ్ అయింది. ‘మిత్ర మండలి’లో ఉండే భారీ క్యాస్టింగ్ వల్ల అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి…

Read more

న‌వంబ‌ర్ 6న మోహ‌న్ లాల్ ‘వృష‌భ‌

మలయాళ సూపర్‌స్టార్‌..కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స్పెష‌ల్‌ క్రేజ్ ఉంటుంది. అన్ని భాష‌ల ఆడియెన్స్ మోహ‌న్‌లాల్‌ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆయ‌న ప్ర‌స్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ ‘వృష‌భ‌’లో హీరోగా న‌టిస్తున్నారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ‘వృషభ’ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే…

Read more

‘పంజరం’ ట్రైలర్ విడుదల

సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆర్ రఘన్ రెడ్డి నిర్మాతగా సాయి కృష్ణ దర్శకత్వంలో అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘పంజరం’. కొత్త వాళ్లంతా కలిసి చేసిన ఈ హారర్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ మాత్రం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. పేదరాసి పెద్దమ్మ అంటూ ఓపెన్ చేసిన ట్రైలర్, ఊరుని చూపించిన తీరు, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. హారర్ మూవీకి ఉండాల్సిన కెమెరా వర్క్, ఆర్ఆర్ ‘పంజరం’లో కనిపించాయి. ట్రైలర్‌లో చివరి షాట్ మాత్రం అందరినీ భయపెట్టించేలానే ఉంది. ఈ ట్రైలర్ లాంఛ్ చేసిన అనంతరం ఈ కార్యక్రమంలో.…

Read more