Skip to content

‘లవ్‌వాలా’ మూవీ గ్రాండ్ గా లాంచ్

‘లవ్‌వాలా’ మూవీ గ్రాండ్ గా లాంచ్ Telugu News

రవీంద్ర తేజ్ హీరోగా SVAN ఎంటర్‌టైన్‌మెంట్ & శుభకరి ఇన్‌ఫ్రా&మీడియా బ్యానర్స్ పై సురేష్ వర్మ, సాయి రామ్ నిర్మిస్తున్న చిత్రం’లవ్‌వాలా’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కొరటాల శివ, బుచ్చిబాబు సానా వద్ద అసోషియేట్ గా పని చేసిన రంజిత్ కుమార్ దేశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అరియా మోడీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా లాంచ్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కొరటాల శివ, బుచ్చిబాబు సానా మేకర్స్ కు స్క్రిప్ట్ అందజేశారు. పలువురు సినీ ప్రముఖులు, మూవీ యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక ఘనంగా జరిగింది.

ఈ చిత్రంలో రాజ్ అర్జున్, మణి చందన, కమల్, నవీన్ నేని, నాగ మహేష్, రష్మీ గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జమ్మా శ్రీను డీవోపీ, తూము రాము ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ బేబీ సురేశ్ భీమగాని.

మూవీ ఓపెనింగ్ ప్రెస్ మీట్ లో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసి మమల్ని బ్లెస్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కొరటాల శివ గారికి, బుచ్చిబాబు సానా గారికి ధన్యవాదాలు. సినిమా అంటే పాషన్ తో నిర్మాణం రంగంలోకి అడుగుపెడుతున్నాం. రంజిత్ చెప్పిన కథ మాకు చాలా నచ్చింది. ఇది చాలా మంచి లవ్ స్టొరీ. రవి హీరోగా నటిస్తున్నారు. అరియ మోడీని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తాం.

హీరో రవీంద్ర తేజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమ్మల్ని బ్లెస్ చేసిన కొరటాల శివ గారికి, బుచ్చిబాబు సానా గారికి ధన్యవాదాలు. ఈ సినిమా పేరు లవ్ వాలా. త్వరలోనే ఫస్ట్ గ్లింప్స్ తో అందరినీ అలరిస్తాం.

డైరెక్టర్ రంజిత్ కుమార్ దేశెట్టి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమ్మల్ని బ్లెస్ చేసిన మా గురూజీ కొరటాల శివ గారికి, బుచ్చిబాబు సానా గారికి ధన్యవాదాలు. నేను శివ గారు, బుచ్చిగారి దగ్గర అసోషియేట్ గా పని చేశాను. ఈ కథ రాసిన తర్వాత సురేష్ గారికి చెప్పాను. ఆయన చాలా నచ్చింది. ఇదొక రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే మంచి లవ్ స్టొరీ.

See also  నేను రెడీ' పాండిచ్చేరిలో సాంగ్ షూట్ పూర్తి

నటీనటులు: రవీంద్ర తేజ్, అరియ మోడీ, రాజ్ అర్జున్, మణి చందన, కమల్, నవీన్ నేని, నాగ మహేష్, రష్మీ గౌతమ్,

దర్శకత్వం: రంజిత్ కుమార్ దేశెట్టి
నిర్మాతలు: సురేష్ వర్మ, సాయి రామ్
బ్యానర్: SVAN ఎంటర్‌టైన్‌మెంట్ & సుభాకరి ఇన్‌ఫ్రా, మీడియా
సంగీతం: విజయ్ బుల్గానిన్
డీవోపీ: జమ్మా శ్రీను
ఎడిటర్: తూము రాము
ఆర్ట్: బేబీ సురేశ్ భీమగాని
కాస్ట్యూమ్ డిజైనర్: దివ్య కాంతమనేని, మాధురి బద్దిగారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ నాగ కృష్ణ ఉప్పలపాటి
పీఆర్వో: వంశీ శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.