Skip to content

హీరో సాయి దుర్గా తేజ్, SYG (సంబరాల ఏటిగట్టు) ముంబై షెడ్యూల్ పూర్తి

హీరో సాయి దుర్గా తేజ్, SYG (సంబరాల ఏటిగట్టు) ముంబై షెడ్యూల్ పూర్తి Telugu News

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. హనుమాన్ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #SYGపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. రోహిత్ కె.పీ దర్శకత్వంలో, నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన ముంబై షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొనడం చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

హనుమాన్ విజయంతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, #SYGతో మరింత భారీగా నిర్మిస్తోంది. ఇప్పటికే పూర్తైన ప్రతి షెడ్యూల్ ఈ ప్రాజెక్ట్ యొక్క భారీ స్థాయి, గొప్ప విజన్‌ను ప్రజెంట్ చస్తోంది. అద్భుతమైన ప్లానింగ్, భారీ నిర్మాణ విలువలు, స్టార్ స్టడెడ్ తారాగణంతో ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

ఇటీవల పూర్తైన ముంబై షెడ్యూల్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొనడం, ఈ చిత్రాన్ని ట్రూ పాన్-ఇండియా స్థాయిలో రూపొందించాలన్న మేకర్స్ లక్ష్యాన్ని మరోసారి చాటిచెప్పింది. జాతీయ స్థాయి నటీనటుల భాగస్వామ్యం చిత్రానికి దేశవ్యాప్తంగా మరింత ఆదరణ తీసుకురానుంది

ఈ భారీ చిత్రంలో సాయి దుర్గా తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడిన పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో అందరినీ మెస్మరైజ్ చేషూర్. ఈ చిత్రం ఆయన సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

#SYGను ప్రపంచ స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించే చిత్రంగా తీర్చిదిద్దేందుకు మేకర్స్ ఎలాంటి రాజీ లేకుండా నిర్మిస్తున్నారు. ప్రతి షెడ్యూల్‌ను అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తుండటంతో, సినిమా స్థాయి రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది.

హనుమాన్ వంటి సంచలన విజయానంతరం ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. #SYG ఆ అంచనాలను మరింతగా అందుకునే స్థాయిలో టీమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు

నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతుండగా, ప్రతి కొత్త అప్‌డేట్‌తో #SYGపై ఆసక్తి మరింత పెరుగుతోంది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా #SYG రూపుదిద్దుకుంటోంది. SYGపై రోజురోజుకూ అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.