మిత్ర మండలి’ కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్.. హీరో ప్రియదర్శి
బివి వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా నటించారు, వీరిలో వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. టీజర్, ‘కట్టండుకో జానకి’, ‘స్వేచా స్టాండు’, ‘జంబర్ గింబర్ లాలా’ వంటి పాటలతో ‘మిత్ర మండలి’పై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఈ చిత్ర బృందం విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌లో సందడి చేసింది…
