ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ‘అరి’ సినిమా
ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుబపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విజయదశమి సందర్భంగా ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘అరి’ సినిమాను ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ…
