Skip to content

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ విడుదల

WhatsApp Image 2025-06-01 at 2.48.09 PM

మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో కథానాయకుడిగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్‌ఫుల్‌ క్రేజీ హీరో సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు ఈ సినిమాను రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్‌ కుమార్‌ బృందావనం మాట్లాడుతూ ” గతంలో మా సంస్థలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో ‘శ్రీవల్లి’ అనే సినిమాను నిర్మించాం. తాజాగా మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తాజాగా ‘గ్యాంబ్లర్స్‌’ చిత్రాన్ని నిర్మించాం. సినిమాలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. మాస్‌ అండ్‌ క్లాస్‌ ఎంటర్‌టైనర్‌గా అందరి మనసులను ఈ చిత్రం దోచుకుంటుంది’ అన్నారు. మరో నిర్మాత సునీత మాట్లాడుతూ ”యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని ఎమోషన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయి. మా సంస్థ నుంచి రాబోతున్న మరో వైవిధ్యమైన చిత్ర. మా బ్యానర్ నుంచి కొత్త కాన్సెప్ట్‌లు చిత్రాలు అందించాలన్నదే మా లక్ష్యం. ఈ సినిమాలో డిఫరెంట్‌ సంగీత్‌ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన పర్‌ఫార్మెన్స్‌ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి అంశం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నూతన ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో మా బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నాం. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మా పాటలను విడుదల చేశాం’ అన్నారు. దర్శకుడు కేఎస్‌కే చైతన్య మాట్లాడుతూ ” ఈ చిత్ర కథ చెప్పగానే నిర్మాతలు ఎంతో ఎక్జ్సైట్ అయ్యారు. ఫుల్‌ ఫ్యాకేజీలా ఈ సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయి. కామెడీ, గ్లామర్‌, మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త లోకంలో ఉంటారు. సరికొత్తగా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌ పీరియన్స్‌ ఇస్తున్నాం. ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌ పర్‌పార్మెన్స్‌ పొటెన్షియాలిటీని చూడబోతున్నారు అన్నారు.

సంగీత్‌ శోభన్‌, ప్రశాంతి చారులింగ, రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, మధుసూదన్‌ రావు, ఛత్రపతి శేఖర్‌, సూర్య భగవాన్‌ దాస్‌ తదితరులు నటిస్తున్న చిత్రానికి

నిర్మాతలు: సునీత, రాజ్‌కుమార్ బృందావనం
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: KSK చైతన్య
కథ – అదనపు స్క్రీన్‌ప్లే – సంభాషణలు: విజయ్ చిట్నీడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ ప్రకాష్
సంగీతం: శశాంక్ తిరుపతి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ప్రేమ్ సాగర్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
ఎడిటర్: శశాంక్ మాలి
యాక్షన్: వింగ్ చున్ అంజి
కొరియోగ్రఫీ: నిక్సన్ డి’క్రూజ్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్లు: అశ్వంత్ బైరీ, ప్రతిభా రెడ్డి

WhatsApp Image 2025-06-01 at 2.48.09 PM (1)
WhatsApp Image 2025-06-01 at 2.48.09 PM (1)
WhatsApp Image 2025-06-01 at 2.48.09 PM
WhatsApp Image 2025-06-01 at 2.48.10 PM (1)
WhatsApp Image 2025-06-01 at 2.48.10 PM
WhatsApp Image 2025-06-01 at 2.48.09 PM (1)WhatsApp Image 2025-06-01 at 2.48.09 PMWhatsApp Image 2025-06-01 at 2.48.10 PM (1)WhatsApp Image 2025-06-01 at 2.48.10 PM

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.